కేసీఆర్.. ఎందుకీ డ్రామాలు; మీకు రైతులమీద ప్రేమ లేదు; రైతుల మరణాలపై సోయి లేదన్న వైయస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ సర్కార్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల తెలంగాణా రైతాంగ సమస్యలపై కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. తెలంగాణా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రాణాలు తీస్తున్న పాపం సీఎం కేసీఆర్ దేనని వైయస్ షర్మిల ఇప్పటికే అనేకమార్లు తేల్చి చెప్పారు., తాజాగా మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కుర్చీ కోసం ఆడుతున్న నాటకాలలో భాగమే తప్ప మీకు రైతుల మీద ప్రేమే లేదు
తెలంగాణ రైతాంగాన్ని కెసిఆర్ మోసం చేస్తున్నారని ఇప్పటికే అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం పై స్పందించారు. రైతుల మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు సీఎం కేసీఆర్ లేఖ రాశారని అది మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఒక భాగమే తప్ప మీకు రైతుల మీద ప్రేమే లేదు అంటూ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేశారు . రైతుల చావుల మీద కూడా సోయి లేదని షర్మిల మండిపడ్డారు.

రైతులు చస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు
ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది అంటూ షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. చివరి గింజ వరకు కొంటానన్న ఊసే లేకుండా పోయిందని కెసిఆర్ ను ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా కెసిఆర్ విస్మరించారని మండిపడ్డారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడి రాక రైతులు చస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైయస్ షర్మిల. కానీ కేంద్రం మెడలు వంచుతామంటే నమ్మాలా? అంటూ నిలదీశారు.

ఎందుకు మీ రాజకీయ డ్రామాలు?
మొన్నటివరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారు అన్న వాళ్ళ మెడలు ఈ రోజు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు?అంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. కేంద్రం దగ్గర సీఎం కేసీఆర్ ఆటలు సాగవని కేవలం జనాలను నమ్మించడం కోసం, కుర్చీ కోసం ఆడుతున్న డ్రామా అని వైయస్ షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ సీఎం కు రైతుల మీద ప్రేమ లేదని, రైతులు చావులపై సోయి లేదని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు.

రైతులు చనిపోతున్నా ఆదుకోవాలన్న సోయే లేదు
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు వారోత్సవాలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్న షర్మిల రైతులు చనిపోతున్నా ఆదుకోవాలన్న సోయే లేదు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంటూ మండిపడ్డారు. ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవండి దొరా అంటూ కెసిఆర్ కు హితవు పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి తో మాటామంతికి, కేరళ సీఎం తో మంతనాలు చేయడానికి, రైతులతో కలిసి దోస్తానా చేయడానికి, జాతీయ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప రాష్ట్రంలో రైతుల పట్ల ఏ మాత్రం ధ్యాస లేదని, రైతులను ఆదుకోవాలన్న సోయి లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఒకపక్క రైతులు చనిపోతుంటే మరోపక్క రైతుబంధు వారోత్సవాలు దేనికోసమో చెప్పాలంటూ వైయస్ షర్మిల నిలదీశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications