వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపర్ షేర్వానీ అంధర్ పరేషానీ: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఫైర్!!

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల 2022 సంవత్సరం చివరి రోజు కూడా తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందని, రాష్ట్రాన్ని అప్పు చేసి బంగారు తెలంగాణ చేశానని దొర కెసిఆర్ చెబుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సరిపోవడం లేదు

దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సరిపోవడం లేదు

రాష్ట్రంలో పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా, ఊపర్ షేర్వానీ అందర్ పరేషాని అన్నట్లుగా ఉందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. దొర కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సరిపోవడం లేదని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు అప్పు 4.50 లక్షల కోట్లు ఉందని షర్మిల పేర్కొన్నారు. ఇంత అప్పుచేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా అని తెలిపారు షర్మిల. ఇన్ని అప్పులు చేసిన కెసిఆర్ ఆ డబ్బంతా ఏం చేశారు అంటూ ప్రశ్నించారు.

అప్పులు తెచ్చి సొమ్మంతా తిన్నది కల్వకుంట్ల కుటుంబం

అప్పులు తెచ్చి సొమ్మంతా తిన్నది కల్వకుంట్ల కుటుంబం


రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కి డబ్బులు లేవని, ఫీజు రీఎంబర్స్మెంట్ కు పైసలు లేవని, ఏ పథకానికి నిధులు లేవని, ఆఖరికి ఉద్యోగుల జీతాలు కూడా అతీగతి లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. దొర చేసిన అప్పులకు ఎనిమిది వందల సంవత్సరాలుగా లక్ష కోట్ల వడ్డీ కట్టామన్నారు. అప్పులు తెచ్చి సొమ్మంతా తిన్నది కల్వకుంట్ల కుటుంబం, కానీ అప్పులు కట్టేది మాత్రం జనం అని పేర్కొన్న వైయస్ షర్మిల మీ పార్టీ అకౌంట్ లో ఉన్న ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలకు వడ్డీలు మీరు తింటే, రాష్ట్ర అప్పులకు జనాలు వడ్డీలు కట్టాలా అంటూ ప్రశ్నించారు.

బంగారు భారత్ చేస్తానంటూ మళ్లీ దేశాన్ని దోచుకోవడానికి బయల్దేరారా?

బంగారు భారత్ చేస్తానంటూ మళ్లీ దేశాన్ని దోచుకోవడానికి బయల్దేరారా?

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మళ్లీ ధనిక రాష్ట్రాన్ని చెబుతున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకు తింటున్నారని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. చక్రవడ్డీ లతో చక్రం తిప్పి ఒక్కొక్కరిని తిన లక్షన్నర అప్పు పెట్టి, బంగారు తెలంగాణ చేశానని ఎలా చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక బంగారు భారత్ చేస్తానంటూ మళ్లీ దేశాన్ని దోచుకోవడానికి సీఎం కేసీఆర్ బయలుదేరారని వైయస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కెసిఆర్ సంతోషంగా, వెనకేసుకున్న డబ్బుతో హాయిగా ఉన్నారని వైయస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు .

English summary
YS Sharmila commented that the financial situation of the state is like outside Sherwani and inside Pareshani, and the state income is not enough to pay the debts EMIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X