వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గూండాలు, తాలిబన్ల పార్టీ! ఈ జన్మ ఎందుకు?: టీఆర్ఎస్, కేసీఆర్‌పై షర్మిల సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె లోటస్ పాండ్ చేరుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని నిలదీశారు.

తాలిబన్లంటూ టీఆర్ఎస్, కేసీఆర్‌పై షర్మిల ఫైర్

తాలిబన్లంటూ టీఆర్ఎస్, కేసీఆర్‌పై షర్మిల ఫైర్

ప్రజల పక్షాణ నిలబడటం తప్పా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా? అని నిలదీశారు. ఇది ఏమైనా ఆప్ఘనిస్తానా? కేసీఆర్ తాలిబన్ నాయకుడా? అని ప్రశ్నించారు షర్మిల. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. తమ ఫ్లేక్సీలను దగ్ధం చేయడం, ఇబ్బందులు పెట్టడంతోపాటు తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారని మండిపడ్డారు షర్మిల. తానుండే బస్సును కూడా తగలబెట్టారని చెప్పారు. టీఆర్ఎస్ గూండాలు తమ పార్టీ నేతలు వాహనాలపై రాళ్ల దాడులు చేశారని, కొట్టారని తెలిపారు. దాడులు చేసినవారిమీద కేసులు పెట్టకుండా.. తనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారని పోలీసులపై మండిపడ్డారు షర్మిల.

టీఆర్ఎస్‌లో గూండాలే ఉన్నారంటూ షర్మిల

టీఆర్ఎస్‌లో గూండాలే ఉన్నారంటూ షర్మిల

టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉద్యమకారులు లేరని.. స్వార్థపరులైన నాయకులు, కార్యకర్తలు, గూండాలే ఉన్నారని షర్మిల వ్యాఖ్యానించారు.వరంగల్‌లో టీఆర్ఎస్ గూండాలు చేసిన బీభత్సాన్ని ప్రగతిభవన్‌కు చూపించేందుకు ధ్వంసమైన కారులోనే వెళుతుంటే.. పోలీసులు అడ్డుకున్నారని షర్మిల చెప్పారు. తమ వాళ్ల ట్రాఫిక్ అంతరాయం కలగలేదన్నారు. పోలీసులు, టీఆర్ఎస్ నాయకులే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చేసి.. తమను అరెస్ట్ చేశారని షర్మిల ఆరోపించారు.

బీజేపీకి ఆర్ఎస్ఎస్‌లా.. టీఆర్ఎస్‌కు పోలీసులంటూ షర్మిల్

బీజేపీకి ఆర్ఎస్ఎస్‌లా.. టీఆర్ఎస్‌కు పోలీసులంటూ షర్మిల్

అంతేగాక, తమ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు పోలీసులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు కాకుంటే ఎందుకు ఇంత దారుణంగా తమ పార్టీ కార్యకర్తలను కొట్టారని షర్మిల ప్రశ్నించారు. అరెస్టు చేసిన తర్వాత కొట్టాల్సిన పనేంటని ప్రశ్నించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలానో.. టీఆర్ఎస్‌కు పోలీసులు అలా తయారయ్యారని అన్నారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

గూండాలు, బందిపోట్ల పార్టీనే.. ఈ జన్మ ఎందుకు?: షర్మిల

గూండాలు, బందిపోట్ల పార్టీనే.. ఈ జన్మ ఎందుకు?: షర్మిల

టీఆర్ఎస్ ముమ్మాటికీ బందిపోట్ల పార్టీనేనని షర్మిల విమర్శించారు. ప్రజలతో ఏనాడైన కేసీఆర్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా ప్రజా దర్బార్ నిర్వహించారా? ఒక్క వాగ్ధానం అయినా నెరవేర్చారా? ఎందుకు ఈ జన్మ? సెక్రటరీకి వెళ్లిన ముఖమేనా? వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ వాళ్లు, ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని షర్మిల ప్రశ్నించారు. తాము తప్ప ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అని అన్నారు. తెలంగాణను అప్పుల కుప్ప చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు. తన కుటుంబసభ్యులను ఇంటివద్ద వదిలేసి తాను ప్రజల కోసం యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. గూండాలు బందిపోట్ల పార్టీ టీఆర్ఎస్ అని దుయ్యబట్టారు.

తెలంగాణను వైఎస్ అడ్డుకోలేదన్న షర్మిల: ఎల్లుండి నుంచి పాదయాత్ర

ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేకే తమ యాత్రను అడ్డుకుంటూ అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మగల్లా మీరు అంటూ మండిపడ్డారు. కోర్టు అనుమతిచ్చిందని.. ఎల్లుండి నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని షర్మిల తెలిపారు. ఆడవాళ్లంటే గౌరవం లేని ప్రభుత్వం కేసీఆర్‌దేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేది టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. అవినీతిపరులంటే వ్యక్తిగత విమర్శలా? అని ప్రశ్నించారు. తాను చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదా? అని ప్రశ్నించారు.రాజశేఖర్ రెడ్డి తెలంగాణను అడ్డుకున్నారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను షర్మిల ఖండించారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ కోసం ఎంతో చేశారని, అప్పుడు ఎవరిలోనూ అభద్రత భావం లేదన్నారు. వైయస్సార్ చనిపోయిన తర్వాతే శ్రీకాంతా చారి చనిపోయాడని గుర్తు చేశారు. తెలంగాణను వైయస్సార్ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

English summary
YS Sharmila hits out at cm kcr and trs after getting bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X