ఎన్నికల యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న వైఎస్ షర్మిల.. జగన్ చెల్లెలా.. మజాకానా!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్ షర్మిల దూకుడును పెంచుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఒంటరిగా అడుగుపెట్టిన వైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పాలన పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న వైయస్ షర్మిల వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పార్టీ సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో వైఎస్ షర్మిల
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుండి పోటీ చేస్తానని, పాలేరు మట్టి సాక్షిగా ప్రమాణం చేసి ప్రకటన చేసిన వైఎస్ షర్మిల, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల రేపు లోటస్ పాండ్ లో పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ఏం చేయాలి? ఏ విధంగా మన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి? తక్కువ సమయంలో ప్రజలకు ఎక్కువగా రీచ్ కావడానికి సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వంటి అనేక విషయాలపై వైయస్ షర్మిల పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రేపు పార్టీ శ్రేణులకు లోటస్ పాండ్ లో వర్క్ షాప్
డిసెంబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ఉమ్మడి జిల్లాల పార్టీ పరిశీలకులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ లకు, మండల మరియు డివిజన్ అధ్యక్షులకు, పట్టణ అధ్యక్షులకు, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తున్న షర్మిల
ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వర్క్ షాప్ కు హాజరుకావాలని పేర్కొంది. దీంతో వైయస్ షర్మిల వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తున్నట్లుగా ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిల, రాజకీయాలను ఈజీగా తీసుకోవడం లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అడుగులను శరవేగంగా, దూకుడుగా వేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది.

తెలంగాణా రాజకీయ వర్గాలకు షర్మిల రాజకీయంపై ఆసక్తి
ఎలాంటి అణిచివేతలు ఎదురైనా, ఆమెను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాటం చేసి తీరుతామని, రాజన్న రాజ్యం తీసుకు వచ్చేవరకూ, వైయస్ సంక్షేమ పాలన అందించే వరకూ తాను వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెబుతున్న షర్మిల, ఆ మార్గంలో తనదైన పంథాలో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె వేస్తున్న అడుగులను తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications