
పాదయాత్రలో ఎమ్మెల్యేలను వదిలిపెట్టని వైఎస్ షర్మిల.. కీలక సమస్యలపై నిలదీసి షాక్ ఇస్తున్నారుగా!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 192 రోజులుగా సాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె అధికార టీఆర్ఎస్ మంత్రులపై, ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా జగిత్యాల జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల కోరుట్ల ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. నిత్యం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యేల పనితీరును ప్రస్తావించి అధికార పార్టీ పాలనా తీరును టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల.
కోరుట్ల ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ఇప్పటికే ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతిని, అక్రమాలను తూర్పారబడుతున్న వైఎస్ షర్మిల తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ను టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యేను, ఎంపీని టార్గెట్ చేసిన షర్మిల, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో టార్గెట్ చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే , ఎంపీ, కేసీఆర్ ముగ్గురు కలిసి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి, చెరుకు రైతుల్ని నిండా ముంచారని మండిపడ్డారు.
చెరుకు రైతుల తరఫున మేం కొట్లాడుతుంటే పిరికిపందల్లా, దద్దమ్మల్లా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఖబడ్దార్.. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజాప్రస్థానాన్ని ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, తెరవలేకుంటే ఉరేసుకుంటా,మని చెప్పిన వారు ఏం చేశారో చెప్పాలని గట్టిగానే టార్గెట్ చేశారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను తూర్పారబట్టిన వైఎస్ షర్మిల
ఇక
మొన్నటికి
మొన్న
ఖానాపూర్
ఎమ్మెల్యే
రేఖా
నాయక్
ను
టార్గెట్
చేశారు
వైఎస్
షర్మిల.
నియోజకవర్గంలో
ఒక్కరికీ
మేలు
చేయలేదు.
గుడిలో
కొబ్బరికాయ
కొట్టాలన్నా
కమీషన్లే
అంటూ
మండిపడ్డారు.
అధికారులకు
పోస్టింగ్
కావాలన్నా
కమీషన్లేనట.
దళితబంధు
కావాలన్నా
కమీషన్లేనట!
ఈ
ఎమ్మెల్యే
కమీషన్లకు
భయపడి
రోడ్లు
వేసే
కాంట్రాక్టర్లు
కూడా
పారిపోతున్నారట
అంటూ
రేఖా
నాయక్
చేస్తున్నది
ఇదే
అని
ప్రజలకు
చెప్పే
ప్రయత్నం
చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
అంతకు
ముందు
తెలంగాణా
మంత్రి
,
ఎమ్మెల్యే
ఇంద్రకరణ్
రెడ్డి
నిర్మల్
నియోజకవర్గ
సమస్యలను
ఏనాడైనా
పరిష్కరించాడా?
అంటూ
మంత్రి
నియోజకవర్గంలోనే
మంత్రిని
టార్గెట్
చేశారు.
పేదలకు
ఇస్తానన్న
డబుల్
బెడ్
రూం
ఇళ్ళు
ఇచ్చాడా?
ఎన్నికల
సమయంలో
కేసీఆర్
ఇక్కడే
మూడ్రోజులు
ఉంటా..
కుర్చీ
వేసుకుని
పోడు
పట్టాలు
ఇస్తా..
అని
చెప్పి
మోసం
చేస్తే..
ఏనాడైనా
ఇంద్రకరణ్
రెడ్డి
ప్రశ్నించిండా?
అంటూ
మంత్రి
ఇంద్రకరణ్
రెడ్డిని
టార్గెట్
చేశారు.

ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తున్న వైఎస్ షర్మిల
ఇలా
ఏ
నియోజకవర్గానికి
వెళ్ళినా
అక్కడ
ఎమ్మెల్యేల
పనితీరును
టార్గెట్
చేస్తున్న
వైఎస్
షర్మిల
మాటల
తూటాలను
పేలుస్తున్నారు.
ఆయా
నియోజకవర్గాలలోనే
సదరు
ఎమ్మెల్యేల
పరువు
నిలువునా
తీస్తున్నారు.
ఇక
నియోజకవర్గంలో
ప్రధాన
సమస్యలను
ప్రస్తావించి
ఎమ్మెల్యేలు
ఇచ్చిన
హామీల
మాటేంటి
అని
ప్రశ్నిస్తున్నారు.
స్థానిక
ప్రజలను
ఆలోచించేలా
చేస్తున్నారు.
దీంతో
ఈ
వ్యవహారం
సదరు
ఎమ్మెల్యేలకు
తలనొప్పిగా
మారింది.
వైఎస్
షర్మిల
పర్యటన
అంటేనే
భయపడేలా
చేస్తుంది.