వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయాలి -రేవంత్ పిలక కేసీఆర్ చేతుల్లో : గవర్నర్ తో షర్మిల భేటీ..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల గవర్నర్ తమిళసైతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి..అవకతవకలపైన ఫిర్యాదు చేసినట్లు షర్మిల వెల్లడించారు. దీని పైన సీబీఐ దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేసారు. అద్బుతమైన ప్రాజెక్టు..అద్బుతమైన మోసంగా రుజువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకొనే కాళేశ్వరం మూడు ఏళ్లల్లోనే మునిపోయిందని ధ్వజమెత్తారు.

తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు ఒకే నిర్మాణ సంస్థకు ఇస్తున్నారని ఆరోపించారు. వందకు నాలుగు వందల రూపాయాల ఖర్చు చూపించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం, ఎవరి చేతుల్లో పెట్టామని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో కట్టారని..ఎందుకు ఉపయోగపడుతోందని నిలదీసారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకు నీరు అందలేదన్నారు. వైఎస్సార్ నాడు కటట్టిన దేవాదుల 18 ఏళ్లు అయినా ఎందుకు మునిగిపోలేదని అడిగారు.

YS Sharmila met Governor: demands action against corruption in Kaleshwaram

కాళేశ్వరం ముంపు గ్రామాలకు ఇంకా పరిహారం అందలేదని షర్మిల చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని డిమాండ్ చేసారు. రేవంత్ బ్లాక్ మెయిలర్ అంటూ షర్మిల ఆరోపించారు.

YS Sharmila met Governor: demands action against corruption in Kaleshwaram

Recommended Video

విరామం కేవలం రాజకీయాల నుండి మాత్రమే*Politics | Telugu OneIndia

రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందన్నారు. బండి సంజయ్ డబ్బులు తీసుకోలేదని రుజువు ఏంటని ప్రశ్నించారు.కేంద్రం అవినీతి జరుగుతుంది అని అంటుంది కానీ.. చర్యలు ఎందుకు తీసుకోలేదని షర్మిల నిలదీసారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని ఆరోపించారు. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన షర్మిల.. ప్రజల పక్షాన తాము నిలబడుతున్నామని చెప్పుకొచ్చారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పోరాడుతోందన్నారు. తాను ప్రస్తావించిన అంశాలు.. ఫిర్యాదుల పైన గవర్నర్ సానుకూలంగా స్పందించారని షర్మిల వివరించారు.

English summary
YSRTP Chief sharmila met Governor Tamisai complaint on Kaleswaram proect irregularties and Corruption in projects
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X