రూటు మార్చిన వైఎస్ షర్మిల; "టీ సేవ్" ప్రతిపక్షాలముందు కొత్త ప్రతిపాదన; సక్సెస్ అవుతారా?
తెలంగాణ సర్కార్ పై పోరాటం చేయడానికి వైఎస్ షర్మిల కొత్త పంధాను ఎంచుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేయడానికి ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని భావిస్తున్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పాదయాత్ర సమయంలో టార్గెట్ చేసే విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల, ఇటీవల కాలంలో తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చేస్తున్న క్రమంలో తాజాగా రూటు మార్చుకున్నారు.
నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా T-SAVE ద్వారా పోరాటం చేద్దాం. రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. pic.twitter.com/VNU9YcCUOf
— YS Sharmila (@realyssharmila) April 3, 2023
ఉమ్మడి పోరాటానికి షర్మిల పిలుపు
ఇటీవల బండి సంజయ్ కు, రేవంత్ రెడ్డికి కలిసి పోరాటం చేద్దామని ఫోన్ చేసిన షర్మిల, తాజాగా ఉమ్మడిగా పోరాటం చేద్దాం రండి అంటూ మరో ప్రతిపాదనను ప్రతిపక్షాల ముందు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటం చేయడానికి టీ సేవ్.. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే ఫోరాన్ని తాను ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా జెండాలు వేరైనా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఒకే అజెండా గా పని చేద్దామంటూ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయాల కంటే మన బిడ్డల మన భవిష్యత్తు మనకు ముఖ్యమని, పార్టీలకు అతీతంగా టి సేవ్ ద్వారా పోరాటం చేద్దామని వైయస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

10 వ తేదీన టీ సేవ్ సమావేశం.. రావాలని పిలుపు
నియంత కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేళ్లుగా అన్యాయం జరుగుతోందని, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి అందరూ ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని వైయస్ షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెసిఆర్ సర్కార్ ప్రతి ఒక్కరి పైన నిరంకుశ విధానాలను అమలు చేస్తుందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కి హౌస్ అరెస్టులు చేసి, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం ఏప్రిల్ 10వ తేదీన అందరం కలిసి సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దామని, అన్ని పార్టీలు కలిసి రావాలని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ సర్కార్ పై కొత్త పోరాటానికి రెడీ అయిన షర్మిల
ఈ క్రమంలోనే అందరూ ఎగతాటిపైకి వచ్చి పోరాడి కెసిఆర్ మెడలు వంచి, నిరుద్యోగులకు న్యాయం చేద్దామన్నారు. పోరాటంలో ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా కలిసి రావాలని వైయస్ షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి కొత్త పంధా ఎంచుకున్న వైఎస్ షర్మిలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయా? మూకుమ్మడి పోరాటానికి అందరూ రెడీ అవుతారా లేదా? అనేది ఏప్రిల్ 10వ తేదీన తేలనుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications