రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొట్టుపెట్టి, స్వీట్ తినిపించారు: ఏ అవసరమున్నా ఫోన్ చేయాలన్న షర్మిల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, పార్టీ నేత వైయస్ షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజు రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిలకు స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. బుధవారం నాలుగు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన మొయినాబాద్ మం డలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శిం చారు. ఉదయం 11 గంటలకు ఎన్కేపల్లిలోని సుగుణ ఇంట్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుగుణ కుమారుడు ఈడి గ రాజప్రవీణ్, కుమార్తె సల్వ పుష్పరాజ్, బిం దు ప్రియదర్శిని, కోడలు జీవామణి, మనుమరాళ్లు ప్రేజీ, సంజన, మనవడు పార్థును ఆమె పరిచయం చేసుకున్నారు.

షర్మిల యాత్రరె

షర్మిల యాత్రరె

వైయస్సార్ కాంగ్స్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, పార్టీ నేత వైయస్ షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజు రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిలకు స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. బుధవారం నాలుగు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు.

స్వీట్ తినిపిస్తూ..

స్వీట్ తినిపిస్తూ..

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన మొయినాబాద్ మం డలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శించారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్కేపల్లిలోని సుగుణ ఇంట్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

అనంతరం సుగుణ కుమారుడు ఈడి గ రాజప్రవీణ్, కుమార్తె సల్వ పుష్పరాజ్, బిందు ప్రియదర్శిని, కోడలు జీవామణి, మనుమరాళ్లు ప్రేజీ, సంజన, మనవడు పార్థును ఆమె పరిచయం చేసుకున్నారు.

చిన్నారులతో..

చిన్నారులతో..

‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ కుటుంబాలు బాగుండాలి. ఏ ఆపద వ చ్చినా నాకు ఫోన్‌చేయండి. నేను మీకు అండగా ఉంటా. మీకు చేయూతనిస్తాం' అని షర్మిల తెలిపారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

సుగుణ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. షర్మిలకు కుటుంబసభ్యులు స్వీట్లు తినిపించారు.

వైయస్‌కు నివాళి

వైయస్‌కు నివాళి

కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

తాండూరు డివిజన్ గోటికగుర్ధుకు చెందిన అవుసుల లక్ష్మయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

మూడోరోజు పరామర్శ యాత్రలో భాగంగా లక్ష్మయ్యచారి కుటుంబాన్ని కలిశారు.

స్వీట్ తినిపిస్తూ..

స్వీట్ తినిపిస్తూ..

లక్ష్మయ్యచారి కొడుకు జగన్నాథ్‌చారి, కోడలు రేణుక, కూతుళ్లు జగదాంబ, లక్ష్మితోపాటు అల్లుడు రాములు ఇతర కుటుంబ సభ్యులను షర్మిల ఆప్యాయంగా పలకరించారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

వారి కష్టాలు విన్న షర్మిల చలించిపోయారు. ఎలాంటి సహాయం కావాలన్నా తనకు ఫోన్ చేయాలని షర్మిల సూచించారు.

‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ కుటుంబాలు బాగుండాలి. ఏ ఆపద వ చ్చినా నాకు ఫోన్‌చేయండి. నేను మీకు అండగా ఉంటా. మీకు చేయూతనిస్తాం' అని షర్మిల తెలిపారు. సుగుణ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. షర్మిలకు కుటుంబసభ్యులు స్వీట్లు తినిపించారు.

కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు డివిజన్ గోటికగుర్ధుకు చెందిన అవుసుల లక్ష్మయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మూడోరోజు పరామర్శ యాత్రలో భాగంగా లక్ష్మయ్యచారి కుటుంబాన్ని కలిశారు. లక్ష్మయ్యచారి కొడుకు జగన్నాథ్‌చారి, కోడలు రేణుక, కూతుళ్లు జగదాంబ, లక్ష్మితోపాటు అల్లుడు రాములు ఇతర కుటుంబ సభ్యులను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టాలు విన్న షర్మిల చలించిపోయారు. ఎలాంటి సహాయం కావాలన్నా తనకు ఫోన్ చేయాలని షర్మిల సూచించారు.

మొదట షర్మిల లక్ష్మయ్యచారితోపాటు దివంగత నేత వైఎస్ చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. లక్ష్మయ్యచారి కూతుళ్లు, కోడలు జగదాంబ, లక్ష్మి, కోడలు రేణుక షర్మిలకు చేతికి గాజులు తొడిగి, పండ్లు, పూలు అందించారు. ఆమె పాదాభివందనం చేయబోతుండగా షర్మిల వద్దని వారించారు.

English summary
YSR Congress leader YS Sharmila Paramarsha Yatra continued in Ranga Reddy district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X