గుండెల్లో పెట్టుకున్నారు: భావోద్వేగానికి గురైన షర్మిల(పిక్చర్స్)
రంగారెడ్డి: మరణించి ఆరేళ్లయినా.. దివంగత సిఎం వైయస్‌ను ప్రజలు తమ గుండెల్లో సజీవంగా పెట్టుకోవడం గర్వంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైయస్ జ్ఞాపకార్థం ఇప్పటికీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా షర్మిల నిర్వహించిన పరామర్శ యాత్ర గురువారం ముగిసింది. జిల్లాలో వైయస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 15కుటుంబాల వారిని ఆమె పరామర్శించారు. 'రాజన్న బిడ్డగా నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించారు.
గురువారం తాండూరు మండలం అడ్కిచర్ల, తట్టేపల్లిలో వైయస్ విగ్రహాలకు నివాళులర్పించిన షర్మిల.. అనంతరం మర్పల్లి, మోమిన్‌పేట, ఎన్కతలలో మూడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత మర్పల్లి మండల కేంద్రంలోని కమ్మరి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి దీపం ఆరడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డానని నారాయణ భార్య నీరజ విలపించడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ఏ కష్టమొచ్చినా తనకు ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు.

వైయస్ షర్మిల
మరణించి ఆరేళ్లయినా.. దివంగత సిఎం వైయస్‌ను ప్రజలు తమ గుండెల్లో సజీవంగా పెట్టుకోవడం గర్వంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు.

వైయస్ షర్మిల
వైయస్ జ్ఞాపకార్థం ఇప్పటికీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.

వైయస్ షర్మిల
రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా షర్మిల నిర్వహించిన పరామర్శ యాత్ర గురువారం ముగిసింది.

వైయస్ షర్మిల
జిల్లాలో వైయస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 15కుటుంబాల వారిని ఆమె పరామర్శించారు.

వైయస్ షర్మిల
'రాజన్న బిడ్డగా నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించారు.

వైయస్ షర్మిల
గురువారం తాండూరు మండలం అడ్కిచర్ల, తట్టేపల్లిలో వైయస్ విగ్రహాలకు నివాళులర్పించిన షర్మిల.. అనంతరం మర్పల్లి, మోమిన్‌పేట, ఎన్కతలలో మూడు కుటుంబాలను పరామర్శించారు.

వైయస్ షర్మిల
తొలుత మర్పల్లి మండల కేంద్రంలోని కమ్మరి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.

వైయస్ షర్మిల
ఇంటి దీపం ఆరడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డానని నారాయణ భార్య నీరజ విలపించడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు.

వైయస్ షర్మిల
ఏ కష్టమొచ్చినా తనకు ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు.
అక్కడ్నుంచి మోమిన్‌పేటలోని అరిగే యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఉపాధి లేని యాదయ్య కుమారుడికి ఆసరా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్కతలలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని కలిశారు. 'నాన్న లేరని దిగులు పడకు.. ఆయన ఆత్మశాంతించేలా బాగా చదువు. నీ ఉన్నత చదవులకు ఎలాంటి సాయమైనా చేస్తా' అని ఆయన కూతురు కృష్ణవేణికి భరోసా ఇచ్చారు.
షర్మిల వెంట పరామర్శ యాత్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్య ప్రకాశ్, ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ పి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications