హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్న చెప్పారు! వైయస్సార్టీపై అమెరికాలో వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో వైయస్సార్ అభిమానులతో వైయస్సార్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడడ్ి రాజకీయ జీవితంలో 30 అని, ఇందులో ఆయన ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆ ఐదేళ్లలోనే వైయస్సార్ కోటానుకోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారన్నారు. అభిమానం ఆస్తిగా సంపాదించారన్నారు.

ఇచ్చిన మాటకు నిలబడిన వ్యక్తి వైయస్సార్

ఇచ్చిన మాటకు నిలబడిన వ్యక్తి వైయస్సార్

'ఏ పథకం ప్రవేశ పెట్టినా అద్భుతంగా అమలు చేసి చూపించారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. మహిళలకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారు. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా తోడ్పాటు అందించారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే బట్టలు ఆరేసు కావాలని ఎగతాలి చేశారు. అయినా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఆంధ్రా ముఖ్యమా? తెలంగాణానా? అంటే వైయస్ చెప్పలేరు

ఆంధ్రా ముఖ్యమా? తెలంగాణానా? అంటే వైయస్ చెప్పలేరు

పేద బిడ్డలు ఫీజు రీయింబర్స్మెంట్ తో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని అరోగ్య శ్రీ పతాకాన్ని అమలు చేశారు. పేద కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రిలో పెద్ద పెద్ద ఆపరేషన్ లు ఉచితంగా చేయించుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్లులు కట్టించారు.

లక్షల ఎకరాల్లో పోడు పట్టాలు ఇచ్చారు. కులం,మతం అనే తేడా లేకుండా ప్రతి వర్గాన్ని వైఎస్సార్ ఆదుకున్నారు. వైఎస్సార్ మరణం వార్త భరించలేక 700 మంది గుండెలు పగిలాయి. దేశంలో ఒక నాయకుడు చనిపోతే ఆయన వెంట 700 వంది చనిపోయారు అంటే..వైఎస్సార్ మీద ప్రేమ అంతా ఇంతా కాదు అని చెప్పారు.

ప్రజలకు వైఎస్సార్ నమ్మకంగా పని చేశాడు. వైఎస్సార్ అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెట్టుకున్నారు. ఎక్కువ శాతం తెలంగాణ లోనే వైఎస్సార్ మరణ వార్త విని చనిపోయారు. ప్రాంతానికి,ప్రజలకు పక్షపాతిగా ఏనాడు ఆలోచన చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించారు.

అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు. ఇవ్వాళ వైఎస్సార్ బ్రతికి ఉన్నా... తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేరు. వైఎస్సార్ ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు షర్మిల.

కేసీఆర్ చేతిలో తెలంగాణ మోసపోయిందన్న షర్మిల

కేసీఆర్ చేతిలో తెలంగాణ మోసపోయిందన్న షర్మిల

ఉద్యమ కారుడు కదా అని పాలన చేతిలో పెడితే.. తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారంటూ సీఎం కేసీఆర్‍పై షర్మిల పరోక్ష విమర్శలు చేశారు. ఎనిమిదిన్నర ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు.

సున్నా వడ్డీకి రుణాలు అని మహిళలను మోసం చేశాడు. కేజీ టూ పీజీ అని విద్యార్థులను మోసం చేశారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఆ పథకాన్ని బ్రష్టు పట్టించారు. ముష్టి 35 వేలు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. తెలంగాణలో అరోగ్య శ్రీ కేసులు ఆసుపత్రులు తీసుకోవడం మానేశాయి. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు అని షర్మిల మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని మోసం... దళితులకు 3 ఎకరాలు అని మోసం. మైనారిటీలకు రిజర్వేషన్ లు పెంపు అని మోసం చేశారని విమర్శించారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. తెలంగాణలో వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అందడం లేదు. కేసీఅర్ చేస్తున్న మోసాలు అన్ని ఇన్ని కావు.

ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎమ్మెల్యే ల అవినీతి నీ ఎత్తి చూపించాం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేసే వరకు నిరుద్యోగం అనే అంశం చర్చ కే లేదు. నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం.. అప్పుడు ప్రతిపక్షానికి సోయి వచ్చింది. అధికార పక్షానికి బుద్ది వచ్చింది. తెలంగాణ లో అవినీతి రాజ్యమేలుతుంది. అన్ని ప్రాజెక్ట్ లు ఓకే వ్యక్తికి ఇస్తున్నారు.

కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 70 వేల కోట్ల అవినీతి జరిగింది. అవినీతిపై డిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశామన్నారు వైఎస్ షర్మిల.

నాన్న చెప్పారు! అందుకే తెలంగాణ కోసం వచ్చానన్న షర్మిల

నాన్న చెప్పారు! అందుకే తెలంగాణ కోసం వచ్చానన్న షర్మిల

జలయజ్ఞం పథకంలో భాగంగా తెలంగాణలోనే ఎక్కువ ప్రాజెక్ట్ లు కట్టించాడు. ఉచిత విద్యుత్ తెలంగాణ లోనే రైతులు ఎక్కువ లబ్ది పొందారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించింది. తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారు. నన్ను ప్రేమించిన ప్రజలు..నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడు. తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న నా గుండెలపై విల్లు రాశాడు.

అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్ళీ తీసుకు రావడం కోసమే పెట్టిన పార్టీ. వైఎస్సార్ పార్టీ జెండాలో వైఎస్సార్ ఉన్నాడు..అజెండాలో వైఎస్సార్ సంక్షేమం ఉంది. ప్రతి పథకాన్ని తెలంగాణ లోని ప్రతి గడపకు చేర్చాలనేది లక్ష్యం. తెలంగాణ ప్రజల కోసం చిత్త శుద్ది గా నిలబడిన పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అని షర్మిల స్పష్టం చేశారు.

English summary
YS Sharmila participates Atmiya sammelanam, held in america.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X