తెలంగాణ సార్వత్రిక ఎన్నికలపై షర్మిళ జోస్యం.!ఫలితాలు అలాగే ఉంటాయన్న వైయస్సార్ టీపి అధినేత్రి.!

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఒకరకంగా రాబోవు సార్వత్రిక ఎన్నికల పట్ల షర్మిల జోష్యం చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశం చెప్తూనే కాంగ్రెస్ పార్టీకి చురకలంటించే ప్రయత్నం చేసారు షర్మిళ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2014లో 21 సీట్లను గెలిచిందని, 2018లో 19సీట్లు గెలిచిందని, అంత పెద్ద చరిత్ర ఉన్న పార్టీ గెలిచిన సీట్లలో ఎంతమందిని కాపాడుకోగలిందని ప్రశ్నించారు షర్మిళ.

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకత్వ లక్షణాలు లేవు..
కాంగ్రెస్ పార్టీలో లీడర్ షిప్ కొరత ఉందని, అందుకే ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోతోందని, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వైభవం ఉండేదని, వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ఒక ప్రాంతియ పార్టీలా ఉండేదని, వైఎస్సార్ లేని కాంగ్రెస్ ఇప్పుడు జీరో అయ్యిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే తాను పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకుండేదని ప్రశ్నించారు. విలీనం చేయాలని అనుకుంటే రెండేళ్లుగా కిందపడి మీదపడి పార్టీని ఎందుకు నడపాలన్నారు షర్మిళ. విలీనం చేయాలని అలోచన ఉంటే 3800కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలని నిలదీసారు షర్మిళ.

 YS Sharmila

విలీనం చేయాలనుకుంటే ఎందుకు ప్రజా పోరాటం చేస్తాం.. పాదయాత్ర చేస్తాం..
అంతే కాకుండా రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక ఫోర్స్ లా తయారయ్యిందని, తెలంగాణాలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరన్నారు షర్మిల. డిల్లికి చెందిన ఒక సర్వే సంస్థ 44సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలిందని షర్మిల షర్మిళ స్పష్టం చేసారు. 44సీట్లలో తన ప్రభావం ఉంటే 5 సీట్లకో, 10సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం తనకు లేదన్నారు షర్మిళ. కాంగ్రెస్ కు లీడర్ షిప్ ఉన్నా... దాన్ని నిలుపుకొనే సత్తా రాష్ట్రంలో లేదని, కర్నాటక కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసే వాళ్లు ఉన్నారని, వారిని చూసి తెలంగాణ నేతలు చేర్చుకోవాలన్నారు షర్మిళ. కర్నాటకలో డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు షర్మిళ.

 YS Sharmila

కర్నాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుంది..
మతరాజకీయాలకు,కుళ్లు రాజకీయాలకు కర్నాటక ఫలితాలు ఒక చెంపపెట్టు లాంటివన్నారు షర్మిళ. అక్కడ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. తెలంగాణలో చంద్రశేఖర్ రావు పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు షర్మిళ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు తెలంగాణ రాష్ట్రానికి సిగ్గు చేటని, లక్షలమంది బిడ్డల ఆశలు అడియాశలయ్యాయని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. అయినా ఇది చిన్న విషయమని చంద్రశేఖర్ రావు అంటున్నారని, పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, ఐటి శాఖ సరిగ్గా పని చేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావని, దర్యాప్తు సరిగ్గా చేస్తే కేటీఆర్ మెడకు చుట్టుకుంటుందని భయపడుతున్నారని షర్మిల వివరించారు.

 YS Sharmila

సీఎం కు దమ్ముంటే సంతకం పెట్టాలి..
ప్రశ్నా పత్రాల పేపర్లు మళ్లి లీక్ కావని ముఖ్యమంత్రి గ్యారెంటి ఇవ్వాలని, చంద్రశేఖర్ రావు తరుపున ఒక అఫిడవిట్ తయారు చేశామని, ఈ డిక్లరేషన్ ను సీఎం కు పంపుతున్నామన్నారు షర్మిళ. ఇదే డిక్లరేషన్ చదువుకొని సంతకం పెట్టాలని సీఎం కు షర్మిళ సూచించారు. ఈ అఫివడిట్ లో పేపర్ లీక్ కాదని రాశామని, పేపర్ లీకులు కాకుండా హామి ఇస్తున్నట్లు ఇందులో ఉందని, సీఎంకు దమ్ముంటే ఈ అఫిడవిట్ లో సంతకం పెట్టాలని షర్మిళ సీఎం కు సవాల్ విసిరారు.చంద్రశేఖర్ రావు రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉద్యోగం భర్తి చేయలేదని, ఈ అఫిడవిట్ లో బిశ్వాల్ కమీషన్ ప్రకారం 1.91లక్షల ఉద్యోగాలను భర్తి చేస్తామని ఇందులో పొందుపరిచామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే వెంటనే ఈ అఫిడవిట్ లో సంతకం పెట్టాలని షర్మిల డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+