వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గేదేలే.. కేసీఆర్ పై వైయస్ షర్మిల సమరభేరి.. పాదయాత్రలతో పాటు నిరుద్యోగ నిరాహార దీక్షలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు చెక్ పెట్టడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగా పోరాటం మొదలు పెట్టిన వైయస్ షర్మిల మొక్కవోని దీక్షతో కెసిఆర్ పై సమరం చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని, ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను అడుగడుగున మోసం చేస్తున్నారని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. పదునైన మాటల బాణాలను ఎక్కు పెడుతూ కేసీఆర్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తూనే నిరుద్యోగ నిరసన దీక్షలకు షర్మిల

ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తూనే నిరుద్యోగ నిరసన దీక్షలకు షర్మిల

ఒకపక్క ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తూనే, మరోపక్క నిరుద్యోగ నిరసన దీక్షలను సైతం వైయస్ షర్మిల కొనసాగిస్తున్నారు. ఎండను, వానను లెక్కచేయకుండా ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. ప్రజలతో మాటా ముచ్చట నిర్వహిస్తూ, నాడు వైఎస్ పాలన ఏ విధంగా ఉంది? నేడు కెసిఆర్ పాలన ఏ విధంగా ఉంది అన్న అంశాలపై ప్రజలు ఆలోచించేలాగా ప్రసంగాలు చేస్తున్నారు. కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల.. ప్రజలను ఆలోచింపజేసేలా ప్రసంగాలు

కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల.. ప్రజలను ఆలోచింపజేసేలా ప్రసంగాలు

ప్రజలకు చాలా చక్కగా అర్ధమయ్యే భాషలో, అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు వైయస్సార్ షర్మిల చేస్తున్న ప్రసంగాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఇక కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం షర్మిల కొనసాగిస్తున్న నిరుద్యోగుల నిరాహార దీక్ష నిన్న కూడా కొనసాగింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే నిరుద్యోగ నిరీక్షణ నిరాహారదీక్షను చేశారు.

 సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ నిరసన దీక్షలో షర్మిల

సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ నిరసన దీక్షలో షర్మిల

మంగళవారం నాడు సూర్యపేట జిల్లాలోని చివ్వెంల మండలం లోని మోదిన్ పురం లో నిరుద్యోగ నిరాహారదీక్ష చేసిన వైఎస్ షర్మిల, తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ కు దున్నపోతు మీద వాన కురిసినట్టు గా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్న వైయస్ షర్మిల, కెసిఆర్ వాటి ఊసే మరిచారు అని విమర్శించారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తున్నా కేసీఆర్ లో మాత్రం ఉలుకు, పలుకు లేదని మండిపడ్డారు.

నిరుద్యోగ భృతి పత్తా లేకుండా పోయిందని మండిపడిన షర్మిల

నిరుద్యోగ భృతి పత్తా లేకుండా పోయిందని మండిపడిన షర్మిల

నిరుద్యోగ బిడ్డలు చనిపోతున్నా సీఎం కేసీఆర్ కు పట్టింపు లేదని నిరుద్యోగ భృతి పత్తా లేకుండా పోయిందని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కెసిఆర్ కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు నియమించుకున్నారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో వివిధ గ్రామాలలో మౌలిక వసతులు కూడా సరిగా లేవని వైయస్ షర్మిల పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు చూశామని, రాష్ట్రంలో మొత్తం 3,500 స్కూల్స్ మూసివేశారని షర్మిల పేర్కొన్నారు.

కెసీఆర్ పాలనలో స్కూళ్ళు, యూనివర్సిటీల పరిస్థితి అధ్వాన్నం

కెసీఆర్ పాలనలో స్కూళ్ళు, యూనివర్సిటీల పరిస్థితి అధ్వాన్నం


స్కూల్స్ లో తరగతి గదులు లేక పిల్లలు చెట్ల కిందనే కూర్చున్నారని, బాత్రూంలు వారికి సరిగా లేవని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా కనిపించడం లేదని షర్మిల పేర్కొన్నారు. ఇక సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం అని కెసిఆర్ చెప్పిన దాని పై షర్మిల ప్రశ్నించారు. పిల్లలకు ఉచిత వైద్యం అన్నారని.. అది ఎక్కడ అంటూ షర్మిల నిలదీశారు. కెసిఆర్ పాలనలో యూనివర్సిటీలు అధ్వాన్నంగా మారాయని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కి సున్నం వేయించలేని దయనీయస్థితిలో కెసిఆర్ ఉన్నారంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు.

English summary
YS Sharmila continues to fight on KCR. KCR is being targeted along with praja prasthanam padayatra and unemployment hunger strikes. sharmila is giving speeches that make people think.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X