ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా?.. కేసీఆర్ థర్డ్ ప్రంట్ చర్చలపై షర్మిల సెటైర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ థర్డ్ ప్రంట్ ప్రయత్నాలపై సెటైర్లు వేశారు. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా..? అంటూ చురకులు అంటించింది. రాష్ట్రంలో రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా ? అని విమర్శలు గుప్పించారు
ఢిల్లీని ఏలడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ..
సీఎం కేసీఆర్ కి ఢిల్లీని ఏలడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ , రాష్ట్రంలో రైతుల చావులను పట్టించుకోవాడానికి సమాయం మాత్రం లేదు దొరగారికి అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? అని ప్రశ్నించింది. మీరు ఇక్కడ రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా ? అని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

ఆత్మహత్యలను ఆపడం చేతకాని సీఎం మనకొద్దు ..
రైతుబంధు ఇచ్చి రైతులకు ఉపాధి చూపుతున్నాం అన్న దొరగారి గప్పాలు నిజమైతే మొన్న ఇద్దరు, నిన్న నలుగురు , ఇవాళ ఒక్కరు. పెట్టిన పెట్టబడి రాక, అప్పుల బాధతో పంట నష్టపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని అన్నారు షర్మిల. రైతు ఆత్మహత్యలను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ తన ట్విట్టర్ లో ట్విట్ చేశారు.

థర్డ్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఫోకస్..
దేశంలో బీజేపీ-కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంతో తృతీయ కూటమి ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే లెప్ట్ పార్టీ జాతీయ నేతలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. హైదబాద్ వచ్చిన కేరళ సిఎం పినరయి విజయన్‌తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ , ప్రకాష్ కారత్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. అనంతరం సీపీఐ నేత డి. రాజా, పలువురు భేటీ అయ్యారు. ఈ భేటీల్లో థర్డ్ ప్రంట్ ఏర్పాటుపై చర్చకువచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ , వామపక్షాల కలయిక రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలోనే ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో దీనిపై చర్చించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌పై థర్డ్ ఫ్రంట్ చర్చలపై వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications