చిన్న దొర ట్విట్టర్ యుద్దాలు నీకెందుకు.. కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు

తెలంగాణలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ యుద్దాలు నీకెందుకు చిన్న దొర అంటూ కేటీఆర్‌పై సెటైర్లు విసిరారు.

గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు

గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు

ఇటీవల వరుసగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చిన్నదొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చేనేత మంత్రి గారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి .. కేటీఆర్ గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యో అనడానికి కూడా నోరు మెదపటం లేదు

అయ్యో అనడానికి కూడా నోరు మెదపటం లేదు

రాజకీయాలు తప్పితే కనీసం అయ్యో అనడానికి కూడా కేటీఆర్ నోరు మెదపటం లేదని షర్మిల మండిపడ్డారు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదని దుయ్యబట్టారు. పంట పెట్టుబడికి అప్పు తెచ్చి, సాగు నీటికోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక, కండ్ల నుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

 తెలంగాణ బిడ్డలను గాలికొదిలేసిన‌ పెద్ద దొర, చిన్న దొర..

తెలంగాణ బిడ్డలను గాలికొదిలేసిన‌ పెద్ద దొర, చిన్న దొర..

చేనేత మగ్గం నడువక, బతుకు బండి సాగక బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని షర్మిల దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయిందన్నారు. నేతన్నల కష్టానికి ఫలితం కరువైంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర, చిన్న దొర దేశాన్ని ఏపోవడానికి తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారని షర్మిల విరుచుకుపడ్డారు.

 టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ

టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ

ముచ్చింతల్ లో ని సమతామూర్తి విగ్రహాన్ని రెండు రోజుల కిందట ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు అవ్వడంపై బీజేపీ , టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని వివక్షకు మారుపేరైన వ్యక్తి ఆవిష్కరించారని ఇది సమతామూర్తి స్పూర్తికే విరుద్దమని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

Recommended Video

    Former IAS Akunuri Murali : రాజ్యాంగ సవరణలు కోరుకోవచ్చు గానీ మార్చాలనడం తప్పే | Oneindia Telugu
    తెలంగాణ రాష్ట్రానికి అండగా మేము..

    తెలంగాణ రాష్ట్రానికి అండగా మేము..

    దీంతో ట్విట్టర్లోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై కిషన్‌రెడ్డి మాట్లాడాలి అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదాపై మాట్లాడండి అని కిషన్‌రెడ్డికి చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు.. అంటూ ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌ .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+