వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరంతా మా కుటుంబం, అండగా ఉంటాం: వైయస్ షర్మిల భరోసా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధైర్యపడవద్దని, మీరంతా మా కుటుంబమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతికి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఆమె సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ జిల్లాలో ఆమె చివరి విడత పరామర్శ యాత్ర కొనసాగుతోంది.

చివరి విడత పరామర్శ యాత్రలో ఆమెను 11 కుటుంబాలను ఆమె పరామర్సిస్తారు. సోమవారం ఉదయం ఆమె లోటస్ పాండ్ నుంచి మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్న షర్మిల ఆ గ్రామంలోని దోమంగడి ముత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

YS Sharmila says she will support the families

ఆ తర్వాత అదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య కుటుంబాన్ని, గోవిందరావుపేట మండలం దుంపెల్లి గూడెంలో దేవిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, సల్వాయిలోని మేడిపల్లి అమ్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు.

YS Sharmila says she will support the families
YS Sharmila says she will support the families

తొలి దశలో 32 కుటుంబాలను, రెండో దశలో 30 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆమె పరామర్శ యాత్ర భూపాలపల్లి మీదుగా సాగి కరీంనగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది.

English summary
The YSR Congress party president YS Jagan's sister YS Sharmila has begun her paramarsha yatra in Warangal district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X