ధ్యాసంతా ఢిల్లీ కుర్చీ మీద.. దోచుకోని దాచుకోవడం మీదే !! : కేసీఆర్ పై షర్మిళ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పాడే ఎక్కుతున్నారా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ద్యాసంత ఢిల్లీ కుర్చీపైనే ఉందని మండిపడ్డారు.
Recommended Video

రైతులు చస్తున్నా పట్టించుకోరా..
బంగారు తెలంగాణ అంటే రైతాంగాన్ని ఆదుకోకుండా చచ్చేలా చేయడమేనా ? అని సీఎం కేసీఆర్‌ని షర్మిల నిలదీశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై విమర్శలు గుప్పించారు. రైతులకు పనికి రాకున్నా, నిర్వాసితులు నిప్పంటించుకుని చచ్చినా, మీ కమీషన్లకు ఢోకా రాకుండా, లక్షల కోట్ల అప్పుతెచ్చి, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో ఎలా కలుపుతున్నారో చూపించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా పట్టించుకునే తీరికలేదు మండిపడ్డారు..

ధ్యాసంత ఢిల్లీ కుర్చీ మీద
తెలంగాణలో నిన్న నలుగురు, ఈరోజు ముగ్గురు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా అని షర్మిలా ప్రశ్నించారు. బంగారు భారతదేశం చేయడానికి బయలిదేరుతున్న కేసీఆర్ దొరగారికి మాత్రం రైతు బతుకులని బాగుచేద్దాం అన్న మనసొస్తలేదని విమర్శించారు. ఆయన ఆలోచనంతా మాటలతో మోసం చెయ్యడం మీద. ధ్యాసంత ఢిల్లీ కుర్చీ మీద. మనసంతా దోచుకున్నది దాచుకోవడం మీదే ఉందని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తాం.
రాష్ట్రంలో రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పింది చాలదన్నట్లు.. దేశంలోని రైతాంగాన్ని పొట్టన పెట్టుకోవడానికి బయలుదేరుతున్నారా? అని కేసీఆర్ పై షర్మిల మండిపడ్డారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధికారిక గుర్తింపు ఇచ్చిన భారత ఎన్నికల సంఘానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజా సేవే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తాం .. వైయస్ఆర్ బాటలోనే పయనిస్తామని షర్మిల స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications