వడ్లు కొనాల్సింది కేసీఆరే! ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారంటూ షర్మిల ఫైర్

హైదరాబాద్: ప్ర‌జాప్ర‌స్థానంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల 35వ రోజు ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మ‌కూరు మండ‌లం పారుప‌ల్లి గ్రామంలో పాద‌యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఉప్పలపహడ్, టి.రాపాక, కప్రాయిపల్లి గ్రామాల మీదుగా సాగింది. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తుంగతుర్తి మండలంలోని రాజన్నగూడెంలో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు.

భూములు ఇస్తానని.. లాక్కుంటున్నారు: కేసీఆర్‌పై షర్మిల ఫైర్

భూములు ఇస్తానని.. లాక్కుంటున్నారు: కేసీఆర్‌పై షర్మిల ఫైర్

అనంతరం మోత్కూరు మండలకేంద్రానికి పాదయాత్ర చేరుకోగా.. అక్కడ మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం మాట ముచ్చట ద్వారా ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అంతకుముందు పారుపల్లి గ్రామంలో వైయస్ షర్మిల మాట్లాడుతూ.. ఎర్ర‌బోళ్ల భూములను ప్రభుత్వం దగ్గరుండి అన్యాక్రాంతం చేస్తోందని మండిపడ్డారు. గ్రామంలోని సర్వే నెంబర్ 279లో సుమారుగా 127ఎకరాల భూమి ఉందని, ఎన్నో ఏండ్లుగా ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. గతంలో వైయస్ఆర్ ఆ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ తన అధీనంలోకి తీసుకోకుండా వాటిని కాపాడి, పేదల కోసం కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేటు మైనింగ్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని అవసరం అయితే నిరాహార దీక్ష కూడా చేస్తానని పేర్కొన్నారు. పేదలకు మూడెకరాలు ఇస్తానని చెప్పి, ఉన్న భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల మేలు కోసం ఒక్క పని కూడా చేయలేదన్నారు వైఎస్ షర్మిల.

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదంటూ షర్మిల విమర్శలు

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదంటూ షర్మిల విమర్శలు

వైయస్ఆర్ ఐదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, అద్భుత పాలన అందించారు. మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు కార్పొరేష‌న్ల ద్వారా లోన్లు ఇప్పించి, స్వయం ఉపాధికి తోడ్పాటు అందించారు. మహిళా సంఘాలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. రైతులకు రుణమాఫీ కల్పించి, రుణ విముక్తుల్ని చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ పంపిణీ చేసిన గొప్ప నాయకులు వైయస్ఆర్ గారు మాత్రమే. పేదింటి విద్యార్థుల‌కు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైయస్ఆర్ హయాంలో ఎంతోమంది యువత డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఎన్నో ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. అయిదేండ్లలో దేశంలోనే కేంద్రం 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ ఒక్క తెలుగు రాష్ట్రంలోనే 46లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించి, రికార్డు సృష్టించారు. ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచని నిఖార్సయిన నాయకుడు మన వైయస్ఆర్. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా.. ఒక్క హామీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్, రైతు రుణ‌మాఫీ మాట‌ల‌కే ప‌రిమితం అయింది. రైతుబంధు ఎక‌రాకు రూ.5వేలు ఇస్తే ఎలా స‌రిపోతాయి? ఎక‌రాకు రూ.5వేలు ఇస్తూ రూ.25వేల విలువైన ప‌థ‌కాల‌ను కేసీఆర్ బంద్ పెట్టిండు. ఎరువుల మీద స‌బ్సిడీ, పంట న‌ష్ట‌పోతే ప‌రిహారం, ఇన్ పుట్ స‌బ్సిడీ, రాయితీపై విత్త‌నాలు, యంత్ర ల‌క్ష్మి వంటి ప‌థ‌కాల‌ను కేసీఆర్ అట‌కెక్కించిండు. ఇంట్లో ఇద్ద‌రు అర్హులుంటే ఒక్క‌రికే పెన్ష‌న్ ఇచ్చి, మరొకరికి అన్యాయం చేస్తుండు. కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోస‌మేనని, ఎన్నిక‌లు వ‌స్తేనే కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తాడు. కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నా. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు షర్మిల.

వడ్లు కొనాల్సింది కేసీఆరే.. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం: షర్మిల

వడ్లు కొనాల్సింది కేసీఆరే.. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం: షర్మిల

రాష్ట్రంలో అప్పులు లేని కుటుంబమే లేదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, ప్రతి కుటుంబంపై నాలుగు లక్షల అప్పు పెట్టిండు. 33 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెంచిండు. వరి వేయొద్దంటున్న కేసీఆర్... ప్రజల సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్లు? కమీషన్ల కోసమా? వరి కొనాల్సిన బాధ్యత కేసీఆర్ దే. ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కే ఓట్లు వేశారు. గతంలో అసెంబ్లీలో చివరి గింజ వరకూ కొంటామని చెప్పి, ఇప్పుడు మాట మార్చిండు. తాను తప్పు చేసి, కేంద్రంపై నెడుతుండు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి. వరి కొనద్దని, వరి వేయొద్దని చెప్పి, రైతులను వ్యవసాయానికి దూరం చేస్తుండు. నాడు వైయస్ఆర్ ఒక్క రూపాయి పెంచకుండా సంక్షేమ పాలన అందిస్తే.. నేడు కేసీఆర్ అన్ని చార్జీలను పెంచుకుంటూ పోతుండు. కరెంట్ చార్జీలు భారీగా పెంచిండు. మంచి నీళ్లకు చార్జీలు వసూలు చేస్తుండు. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతుండు. తన స్వార్థం కోసం అప్పులు చేసి, ప్రజలపై పన్నులు వేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

ఆ ఉద్యోగాలు ప్రగతిభవన్ కాకులు ఎత్తుకుపోయయా?: షర్మిల

ఆ ఉద్యోగాలు ప్రగతిభవన్ కాకులు ఎత్తుకుపోయయా?: షర్మిల

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది. నాడు ఉద్యమంలో యువత ప్రాణాలు వదిలితే.. నేడు ఉద్యోగాల కోసం వదులుతున్నారు. ఎనిమిదేండ్లు ఊరిచ్చి ఊరిచ్చి 80వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. పీఆర్ఎసీ, బిశ్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. కానీ కేసీఆర్ ప్రకటించింది మాత్రం 80వేలే. మిగిలిన లక్ష ఉద్యోగాలు ప్రగతి భవన్ కాకులు ఎత్తుకుపోయాయా? నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగమైతే.. నిరుద్యోగానికి కారణం కేసీఆర్. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ కేసీఆర్ చేసిన హత్యలే. ఉద్యోగాలు లేక యువత ఏజ్ బార్ అయి, తల్లిదండ్రులకు భారమై, సమాజంలో తలెత్తుకోలేక నిరాశ, నిస్పృహతో కుంగిపోతుంటే.. కేసీఆర్ మాత్రం దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. వందల మంది చనిపోయినా ఏ ఒక్కరినీ పరామర్శించలేదు. ఏ కుటుంబానికి ఓదార్పు ఇవ్వలేదు. ప్రజలు తమ కోసం పనిచేస్తారని ఓట్లు వేస్తే కేసీఆర్ మాత్రం కుటుంబం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.

తుంగతుర్తి అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ షర్మిల

తుంగతుర్తి అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ షర్మిల

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నా ఏ పార్టీ ప్రశ్నించడం లేదు. ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ కు అమ్ముడుపోయాయి. టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేస్తే, ఆ పార్టీ నాయకులు కేసీఆర్ సంకలో చేరారు. ప్రజల పక్షాన పోరాటే పార్టీయే లేకుండా పోయింది. అందుకే మేం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు, ప్రజల తరఫున పోరాడేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు పార్టీ స్థాపించాం. మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా చెబుతున్నా.. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తాం. YSR తెలంగాణ పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తూ.. తన గానం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఏపూరి సోమన్నను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు వైఎస్ షర్మిల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+