వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు, అవినీతి లెక్కలతో టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. తగ్గేదేలే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర మంత్రులను, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును టార్గెట్ చేస్తూ వైయస్సార్ తెలంగాణ పార్టీ వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి నిరంజన్ రెడ్డి ని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేశారు. లిక్కర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాకు ఏం చేశారంటూ వైయస్ షర్మిల ఆయన పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

 మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

లిక్కర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలకు చేసింది సున్నా అంటూ మండిపడిన వైయస్ షర్మిల, ఆయన హయాంలో పాలమూరు జిల్లా ఏ మాత్రం అభివృద్ధి చెంద లేదంటూ వ్యాఖ్యలు చేశారు. పాలమూరు యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఐటీ పార్కు లేదు. ఫుడ్ ఇండస్ట్రియల్ పార్క్ లేదు. భూములు మాత్రం ఏడికాడికి కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారని షర్మిల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేశారు.

వందల ఎకరాల భూములు కబ్జా .. మంత్రిపై షర్మిల ఆరోపణ

వందల ఎకరాల భూములు కబ్జా .. మంత్రిపై షర్మిల ఆరోపణ

ఐటి ఇండస్ట్రియల్ పార్కు ఇస్తామని చెప్పి, 20 వేల ఉద్యోగాలు జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఐటీ ఇండస్ట్రియల్ పార్కు కోసం కేటాయించిన 480 ఎకరాల భూమిలో వంద ఎకరాలను ఎమ్మెల్యే కబ్జా చేశారని వైయస్ షర్మిల ఆరోపించారు . ఆఖరికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా కట్టి తమ్ముడితో కలిసి ఒక్కొక్క ఇల్లు మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని వైయస్ షర్మిల ఆరోపించారు. ఇక ఆయన లిక్కర్ మంత్రి అంటూ టార్గెట్ చేసిన వైయస్ షర్మిల ఎవరి కోసం మంత్రులయ్యారో చెప్పాలంటూ నిలదీశారు. ప్రజలకు ఏం మేలు చేశారో చూపించాలి అంటూ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో ప్రతిచోటా ప్రజలు ఎమ్మెల్యేలపై, మంత్రులపై తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

అవినీతిపై ప్రశ్నిస్తే వారి వెన్నులో వణుకు

అవినీతిపై ప్రశ్నిస్తే వారి వెన్నులో వణుకు

పాలమూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి అని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు చెబుతుంటే, వాటిని తాము ప్రశ్నిస్తున్నామని వైయస్ షర్మిల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ప్రశ్నిస్తుంటే వారి వెన్నులో వణుకు పుడుతోందని అందుకే తనపై ఎదురు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైయస్ షర్మిల తెలిపారు. ఒకప్పుడు అప్పుల్లో ఉన్న నేతలు ఇప్పుడు వందల వేల కోట్ల ఆస్తులకు ఎట్లా అధిపతులు అయ్యారో చెప్పాలని వైయస్ షర్మిల నిలదీశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై పోరు కొనసాగిస్తాం

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై పోరు కొనసాగిస్తాం


ఇక ఇదే సమయంలో పాలమూరు-నీళ్ల పోరులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టిన 24గంటల నిరాహార దీక్షకు ప్రజలు, రైతు, ప్రజా సంఘాల మద్దతు తెలిపారని షర్మిల వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు .

English summary
Liquor Minister Srinivas Goud was targeted by YS Sharmila for corruption and misappropriation. He asked what was done to Palamuru district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X