Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్, బీజేపీలను నిలదీయండి, అమ్ముడుపోదామా అన్నట్టే కాంగ్రెస్ నేతలకూ షర్మిల షాక్ !!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్సార్ వారసురాలిగా దూకుడు చూపిస్తున్న వైయస్ షర్మిల అధికార టీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హుజురాబాద్ నియోజకవర్గంలో చేసిన పర్యటన ఆసక్తిని కలిగించింది. వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలం సిరిసేడుకు చెందిన మహమ్మద్ రఫీ నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

 ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి షబ్బీర్ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగంపై గత కొంత కాలంగా ప్రతి మంగళవారం రోజు నిరుద్యోగులకు సంఘీభావంగా నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల ఈరోజు సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగిన దీక్షలో వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ధ్వజమెత్తారు.

దున్నపోతు మీద వాన కురిసినట్టు కేసీఆర్ తీరు

దున్నపోతు మీద వాన కురిసినట్టు కేసీఆర్ తీరు

కెసిఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. కెసిఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నాలుగింతలు నిరుద్యోగం పెరిగిందని షర్మిల విమర్శించారు. ఖాళీలు ఉన్నా ఉద్యోగాల భర్తీ చేయడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు వైయస్ షర్మిల. ఇంతా జరుగుతున్నా కెసిఆర్ లో చలనం లేదని, దున్నపోతు మీద వాన కురిసిన చందంగా కేసీఆర్ తీరు ఉందని నిప్పులు చెరిగారు. కెసిఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉండగా, సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందుకు గుర్తుకొస్తారు అంటూ మండిపడ్డారు షర్మిల.

హుజురాబాద్ ఎన్నికలు ప్రజల కోసమా ? వాళ్ళ బలాలు నిరూపణ కోసమా

హుజురాబాద్ ఎన్నికలు ప్రజల కోసమా ? వాళ్ళ బలాలు నిరూపణ కోసమా

తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ఈ ఏడేళ్లలో సాధించిన ప్రగతి ఏంటి ? ఉద్యమ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారు అన్నది కె సి ఆర్ నే కదా.. మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నించారు షర్మిల. ఇదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలపై గతంలోనే తమ స్టాండ్ ప్రకటించిన షర్మిల మరోమారు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ లో ఎన్నికలు ఎందుకు వచ్చాయి.. ఈ ఎన్నికలు ప్రజల కోసమా ? వాళ్ల బలాలు నిరూపించుకోవడం కోసమా అంటూ ప్రశ్నించిన షర్మిల, టీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే నిరుద్యోగ సమస్యపై నిలదీయండి అంటూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓట్ల కోసం వస్తే టీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ నాయకులను నిలదీయండి

ఓట్ల కోసం వస్తే టీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ నాయకులను నిలదీయండి


ఇంతకాలం నిద్రపోయారా ? గాడిదలు కాశారా అని అడగండి అంటూ ద్వజమెత్తారు. ఎంత మంది చనిపోయిన కేసీఆర్ కు ఇంగిత జ్ఞానం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ సైతం నిలదీయాలని పేర్కొన్న షర్మిల, కేంద్రం ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ అంటూ బిజెపిని సైతం టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించే లేదన్న షర్మిల కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు రేటు వస్తుందా ఎప్పుడు అమ్ముడు పోదామా అని చూస్తున్నారని నిప్పులు చెరిగారు .

దళితులకు కేసీఆర్ ఇస్తుంది ఆయన డబ్బేమీ కాదు

దళితులకు కేసీఆర్ ఇస్తుంది ఆయన డబ్బేమీ కాదు

ఉప ఎన్నిక వస్తేనే దళితులు బంధువులు అయ్యారా అని ప్రశ్నించిన షర్మిల ఓ పథకాన్ని తీసుకు వచ్చి ఎన్నికల కోసమే ఈ పథకం అని చెప్పే సీఎం దేశంలోనే లేరని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితుల భూములను లాక్కుని లక్షల కోట్లకు అమ్ముకుంటున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో దళితులకు ఇస్తున్న డబ్బు కేసీఆర్ డబ్బేమీ కాదని పేర్కొన్న షర్మిల సీఎం కేసీఆర్ దళితులకు యాభై ఒక్క లక్షలు బాకీ ఉన్నాడని ద్వజమెత్తారు.

 కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా పోటీ చేసే నిరుద్యోగులకు , రైతులకు , చేనేతలకు మద్దతు

కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా పోటీ చేసే నిరుద్యోగులకు , రైతులకు , చేనేతలకు మద్దతు


కేవలం ఇప్పుడు ఇస్తుంది 10 లక్షలు మాత్రమేనని పేర్కొన్న షర్మిల, ఈ 10 లక్షలు తీసుకున్న తర్వాత 41 లక్షలు వసూలు చేయండి అంటూ దళితులకు పిలుపునిచ్చారు. కెసిఆర్ తాను దొరను అని, అందరూ ఆయన కాళ్ల దగ్గర ఉండాలని అనుకుంటారని పేర్కొన్న షర్మిల దళితులు సీఎం కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా హుజురాబాద్ రావాలని పిలుపునిచ్చారు . హుజూరాబాద్ నియోజకవర్గం లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పేర్కొన్న షర్మిల, కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికీ తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు, చేనేత కార్మికుల భార్యలకు, నిరుద్యోగులకు, రైతులకు ఎప్పుడూ వైయస్సార్ తెలంగాణ పార్టీ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు షర్మిల. కెసిఆర్ నిరంకుశ పాలనను ప్రపంచమంతా చూపించడానికి అందరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.

హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరోమారు స్పష్టం

హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరోమారు స్పష్టం

హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నించిన షర్మిల, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని ఇదివరకే స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందా ? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీ చేస్తామంటూ షర్మిల గతంలోనే తమ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయ్యబోదని వెల్లడించారు. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమేనని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో వైయస్సార్ టీపీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+