• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నదెవరు?మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి చంపిందెవరు?:వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వైయస్ షర్మిల తాను సాగించిన ప్రజా ప్రస్థాన పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మేర తన ప్రయాణాన్ని సాగించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె తన మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశారు.

గతంలో కేసీఆర్ ఏం చేశారు? వైఎస్ షర్మిల ప్రశ్న

మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో వైయస్సార్ పైలాన్ ను ఆ పార్టీ నేతలు వైయస్ షర్మిల, ఆమె తల్లి వైయస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన వైయస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మోసగాడు అంటూ విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన కెసిఆర్, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ గతంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

కెసిఆర్..మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి మరీ చంపాడు కదా?

కెసిఆర్..మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి మరీ చంపాడు కదా?

గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆర్ కాదా అంటూ వైయస్ షర్మిల నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్కో ఓటు వేల రూపాయలకు కొనుగోలు చేసి, సర్పంచులకు, ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులకు కోట్లాది రూపాయలను ఎరవేసి పార్టీ మార్చుకున్నది కెసిఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపటం కాదా అంటూ నిలదీశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించాలని దండాలు పెడుతున్న కెసిఆర్..మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి మరీ చంపాడు కదా? అని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా?


గ్రామానికో ఎమ్మెల్యేను పెట్టి,విచ్చలవిడిగా డబ్బులు,మద్యం పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదా? చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? కెసిఆర్ అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీరు నిజంగా నిజాయతీపరులైతే, మీరు సుద్దపూసలే అయితే సీబీఐని రహస్యంగా ఎందుకు నిషేధించినట్టు? అని ప్రశ్నించిన వైయస్ షర్మిల సీబీఐ అంటే ఎందుకంత భయం? చిత్తశుద్ధి నిరూపించుకునే దమ్ములేక, పిరికిపందల్లా సీబీఐని రాకుండా చేశారు అని అసహనం వ్యక్తం చేశారు.

గుమ్మడికాయల దొంగలు మీరే, అందుకే ఇదంతా

గుమ్మడికాయల దొంగలు మీరే కాబట్టి సి.బి.ఐపై నిషేదం విధించారు అని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. మీరు నిజాయితీపరులు అయితే మీరు అవినీతి చేయకపోతే మీరు సిబిఐ పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. సిబిఐ రావటానికి వీలు లేదని రహస్య జీవోలు జారీ చేయడం వెనక ఆంతర్యమేమిటో జనాలకు తెలుసు అన్నారు. మీరు పారదర్శకంగా పాలన చేస్తే ఏ ఎంక్వైరీ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారని, అలా చేయలేదు కాబట్టే ఇప్పుడు ఇంత భయపడుతున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిల

ఇక ఇదే సమయంలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైయస్ షర్మిల తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 3000 కిలోమీటర్ల మహాయజ్ఞము ఈ అశేష తెలంగాణ ప్రజల ప్రేమ, నమ్మకానికి అంకితం. నాడు నాన్న సంక్షేమపాలనకు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు, నేడు ఆ పాలన మళ్ళీ రావాలని నన్ను ఆశీర్వదిస్తున్నారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

English summary
YS Sharmila responded to KCR's comments in the MLA buying episode during the padayatra. Who bought Congress MLAs? In the munugode, and said KCR asking for democracy who has killed democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X