Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయమ్మ నిర్ణయం సరైనదేనా - వైఎస్సార్టీపీలో కొత్త బాధ్యతలు : కలిసొచ్చేనా..!!

వైసీపీ గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి విజయమ్మ తప్పుకున్నారు. తాను తెలంగాణలో తన కుమార్తెకు మద్దతుగా నిలవనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి దూరంగా అవుతున్నట్లు చెప్పినా.. జగన్ కు తల్లిగా పూర్తిగా మద్దతిస్తానని స్పష్టం చేసారు. ప్రకటన తరువాత ప్లీనరీ సమావేశంలో కంటిన్యూ అయ్యారు. రెండ రోజు సైతం ప్లీనరీకి హాజరయ్యారు. ఈ పరిణామాల పైన షర్మిల స్పందించారు.

కుమార్తె పైన ప్రేమతో ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పుకొచ్చారు. విజయమ్మ తన కుమార్తెకు మద్దతుగా వైఎస్సార్టీపీలో కీలక బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విజయమ్మ.. త్వరలో వైఎస్పార్టీపీ గౌరవాధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు రంగం సిద్దమైనట్లుగా తెలుస్తోంది.

నాడు జగన్ కోసం.. నేడు షర్మిల కోసం

నాడు జగన్ కోసం.. నేడు షర్మిల కోసం

ఇప్పటికే షర్మిల తెలంగాణలో కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసారు. ప్రతీ నియోజకవర్గంలో పర్యటన పూర్తి చేస్తానని స్పష్టం చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. షర్మిలకు మద్దతుగా.. వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ ప్రచార పర్వంలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం.

అందులో భాగంగా.. నాడు జగన్ కు మద్దతుగా ఏపీలో ప్రచారంలో చేసిన విజయమ్మ..ఇప్పుడు షర్మిలకు అదే తరహాలో శక్తి మేర సహకరించేందుకు సిద్దం అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా ఏడాది సమయం ఉంది. 2023 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది.

తెలంగాణలో పరిస్థితులు అనుకూలించేనా

తెలంగాణలో పరిస్థితులు అనుకూలించేనా

వచ్చే ఆగస్టు లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్టీపీలో పేరున్న నేతల చేరిక జరగలేదు. నాడు జగన్ కు మద్దతుగా విజయమ్మ - షర్మిల చేసిన ప్రచారం కలిసి వచ్చింది. నాడు సెంటిమెంట్ వీరద్దరి ప్రచారంతో ఓట్లుగా మారాయి.

జగన్ కు విజయం వెనుక ఈ ఇద్దరి ప్రచారం కీలకంగా మారింది. అయితే, నాటి ఏపీ పరిస్థితులకు పూర్తి భిన్నంగా తెలంగాణ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ నాడు చేసిన సంక్షేమ నిర్ణయాలు.. పాలన గురించి చెబుతూనే.. విజయమ్మ ప్రచారం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణ కోడలుగా షర్మిల జనంలోకి వెళ్తున్నారు. విజయమ్మ వైఎస్సార్ సతీమణిగా.. షర్మిల తల్లిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.

పొలిటికల్ గా కొత్త పాత్రలో విజయమ్మ

పొలిటికల్ గా కొత్త పాత్రలో విజయమ్మ

నాడు ఏపీలో కాంగ్రెస్ తమను వేధిస్తున్న విధానం.. వారితో చంద్రబాబు కలిసారంటూ చేసిన ప్రచారంతో రాజకీయంగా పరిస్థితులు కలిసి వచ్చాయి. కానీ, ఇప్పుడు తెలంగాణలో వైఎస్సార్ ఇమేజ్ ను పూర్తిగా షర్మిలకు వదిలేయటానికి కాంగ్రెస్ సిద్దంగా లేదు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం వైఎస్సార్ తమ పార్టీ నేతగా..ఆయన మద్దతు దారులను సైతం కలుపుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో.. కష్టాల్లో ఉన్న కుమార్తెకు మద్దతుగా నిలుస్తానంటూ వైసీసీ పదవికి రాజీనామాకు నిర్ణయించిన విజయమ్మ..తెలంగాణలో ఏ మేర తన శక్తి చాటుతారనేది ఇప్పుడు రాజీకయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+