మాకు ఛాన్స్ లేదు: టీఆర్ఎస్‌కు జగన్ పార్టీ మద్దతు
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి ప్రస్తుతం తమ పార్టీకి లేదని, అయితే బాధ్యత గల పార్టీగా మా ఓటు హక్కును వినియోగించుకుంటామని, తెరాసకు ఓటు వేస్తామని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇటీవల ఏపీ శాసన మండలికి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నికునే ప్రక్రియలో నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన ఇదే తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్‌గా తమ పార్టీ సభ్యుడు సతీష్ రెడ్డిని గెలిపించుకుందని ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాటి ముఖ్ యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విప్ జారీ చేసి కాపాడారాని తెలిపారు. ఇటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు వైసీపీ తెరాసకు మద్దతు తెలుపుతుందన్నారు. వైసీపీ విడుదల చేసిన ఈ ప్రకటన ఎంపీ, వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు...
శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రహస్య శిబిరాలు ఏర్పాటు చేశాయి.
ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలను రహస్య శిబిరానికి తరలించారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్న టీడీపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను గోల్కొండ రిసార్టులో ఉంచింది.












Click it and Unblock the Notifications