ఇమేజ్‌లో అన్నతో చెల్లి పోటీ: తమిళనాడు నుంచి షర్మిల ఫ్యాన్స్: పార్టీని విస్తరించాలంటూ!
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. చారిత్రాత్మక ఘట్టానికి సమాయాత్తమౌతోన్నారు. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముహూర్తం సమీపిస్తోంది. తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ ప్రకటన వేదిక ఖరారైంది. షెడ్యూల్ ఫిక్స్ అయింది. పార్టీని అధికారికంగా ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్న వైఎస్ షర్మిల ప్రస్తుతం బెంగళూరులో ఉంటోన్నారు.
ఈ నెల 8వ తేదీన ఆమె అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుని, తండ్రికి నివాళి అర్పిస్తారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. వైఎస్ షర్మిలను కలుసుకోవడానికి తమిళనాడు నుంచి పలువురు అభిమానులు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు.

షర్మిల అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్టా రామిరెడ్డిలను కలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. వైఎస్ షర్మిల పార్టీకి తాము అండగా ఉంటామని, తమిళనాడులో విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై సహా పలు జిల్లాల్లో వైఎస్సార్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని వారు చెప్పారు.

Recommended Video
కాగా- తన ఛరిష్మాను విస్తరింపజేసుకునే ప్రయత్నంలో వైఎస్ షర్మిల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో వైఎస్ జగన్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. వైఎస్ జగన్-తమిళ హీరో విజయ్‌కు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు ఇప్పటికే వెలిశాయక్కడ. పలుచోట్ల కటౌట్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో- వైఎస్ షర్మిల కూడా అదే స్థాయిలో ఇమేజ్‌ను సంపాదించుకునేలా కనిపిస్తోన్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా నియమితులైనట్లు చెబుతోన్న ప్రియా.. తమిళనాడుకు చెందినవారే.












Click it and Unblock the Notifications