నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: కూటమి ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గజ్వెల్, కొడంగల్, సిరిసిల్ల వంటి వాటితో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గంలో కూడా పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలో ఉండటమే కారణం. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన తెరాసలో చేరారు.
ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆయన బరిలో నిలిచారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ కూకట్‌పల్లి స్థానాన్ని తీసుకుంది. పోటీ విషయంలో తర్జన భర్జన అనంతరం నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసినిని బరిలోకి దింపింది. నాడు టీడీపీ నుంచి గెలిచిన మాధవరం తెరాస నుంచి పోటీ చేయడం, అతనిపై ఈమె బరిలోకి దిగడం.. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది.

ఈ సమీకరణాలతో సుహాసినికి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు
కూకట్‌పల్లి నియోకవర్గం సమీకరణాలను చూస్తే నందమూరి సుహాసిని గెలుపు ఖాయమని మహాకూటమి చెబుతోంది. ఇక్కడి ఏపీ ఓటర్లు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉన్న బలం, నందమూరి కుటుంబానికి ఉన్న చరిష్మా, ఇటీవల గొట్టిముక్కల పద్మారావు వంటి నేతల చేరిక తదితర సమీకరణాలతో సుహాసిని భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నారు. పలువురు సినీ నటులు కూడా ఆమెకు మద్దతు పలికారు.

తెరాసకు వైసీపీ మద్దతు
ఈ విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన దూరం పాటిస్తోంది. ఈ రెండు పార్టీలు ఏపీలో కీలకంగా ఉన్నాయి. ఇందులో జగన్మమోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి తెలంగాణలో కొంత బలం ఉంది. ఏపీ ఓటర్లు ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గంలోను ఆ పార్టీకి బలం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి వైసీపీ.. తెరాసకు మద్దతివ్వాలని నిర్ణయించింది.

సుహాసిని ఓటమి కోసం వైసీపీ
కూకట్‌పల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు.. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇక్కడ నందమూరి సుహాసినిని ఓడించాలని వైసీపీ భావిస్తోంది.
Recommended Video


కమ్మ కంటే కాపు, రెడ్డి వర్గీయులు ఎక్కువ
తెరాస నుంచి పోటీ చేస్తున్న మాధవరం కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. సుహాసినిది కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ వెలమ సామాజిక వర్గం కేవలం 3వేలు మాత్రమే ఉంది. కమ్మ సామాజిక వర్గం 13వేల వరకు ఉంది. రెడ్డి సామాజిక వర్గం 22వేలకు పైగా ఉంది. ఇక, ఇక్కడ ఎక్కువగా ఉన్నది కాపు సామాజిక వర్గం. 64వేలు ఉంటారు. ముస్లీంలు 61వేల మంది ఉంటారు.

కేసీఆర్ గెలిస్తే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి! ఇదీ లెక్క
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గెలవాలని జగన్ సహా వైసీపీ వర్గీయులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, తెజస, సీపీఐ నేతృత్వంలోని మహాకూటమి గెలిస్తే ఏపీలో ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అప్పుడు ఏపీలోను కాంగ్రెస్, టీడీపీలకు ప్లస్ అవుతుంది. అదే తెరాస గెలిస్తే కాంగ్రెస్, టీడీపీ కూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్లు అవుతుంది. ఈ ప్రభావం ఏపీలోను పడి అది వైసీపీకి ప్లస్ అవుతుందని, అప్పుడు వైసీపీ గెలవడానికి మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు. అందుకే జగన్, వైసీపీ నాయకులు మహాకూటమి ఓడిపోవాలని చూస్తున్నారు.

కూకట్‌పల్లివాసులకు వైసీపీ విజ్ఞప్తి
తెలంగాణలోని సీమాంధ్రులు, ముఖ్యంగా కూకట్‌పల్లి వాసులు మహాకూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అలాగే కేసీఆర్ పాలనలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, సీమాంధ్రులను కూడా తెలంగాణ వారితో సమానంగా చూస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి తెరాసకే ఓటు వేయాలని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ సామాజికవర్గం ఎక్కువే కానీ
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహాకూటమి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అతను ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్న కాపు సామాజిక వర్గం నేత జనసేనాని. కాకుంటే ఇక్కడి కాపులలో ఐక్యత లేదని అంటున్నారు. ఇక్కడి ఓట్లు చీలడం వల్లే టీడీపీకి గతంలో లాభించిందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి టీడీపీని ఏపీ పార్టీగా చూస్తూ ఓటు వేస్తున్నారట.

సుహాసినిని ఓడించాలన్న కోరిక నెరవేరేనా?
అలాగే, ఓటింగ్ విషయంలో తెలంగాణ ముస్లీంలకు భిన్నంగా ఏపీ ముస్లీంలు ఆలోచిస్తారని చెబుతున్నారు. వీరు కూడా కూకట్‌పల్లిలో ఎక్కువగా ఉన్నారు. ప్రతి ప్రాంతంలో వీరి ఓట్లు గంపగుత్తగా ఓ వైపు పడతాయి. కానీ కూకట్‌పల్లిలో మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు. వీరి ఓట్లు కూడా టీఆర్ఎస్, టీడీపీలకు చీలుపోతాయంటున్నారు. అయితే కేసీఆర్ పాలన కారణంగా వీరు తెరాస వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. మొత్తానికి సుహాసినిని ఓడించాలన్న వైసీపీ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications