హైదరాబాద్ కు వైఎస్ షర్మిల - ప్రభుత్వానికి సవాల్..!!
ప్రభుత్వం పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రభుత్వం పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఒక మహిళ పై ఇంత నీచండా మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తాను ప్రశ్నించినందుకు శంకర్ నాయక్ దాడికి ప్రయత్నం చేసారని చెప్పుకొచ్చారు. కుట్రతోనే తన పాదయాత్రను అడ్డుకున్నారని షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలను మహబూబాబాద్ లో ఈ ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తరలించారు. తనను అరెస్ట్ చేయటం పైన షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.
షర్మిల పాదయాత్ర సమయంలో మహూబూబాబాద్ లో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు అరెస్ట్ చేసారు. పాదయాత్ర అనుమతి రద్దు చేసారు. మహబూబాబాద్ లో పాదయాత్ర సమయంలో స్థానిక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పైన షర్మిల సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. షర్మిల పైన ఎస్టీ కేసు నమోదు చేసారు. షర్మిల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేసారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.పోలీసులు షర్మిలను లోటస్ పాండ్ కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం పైన స్పందించిన షర్మిల కోర్టు చెప్పినా వినకుండా వారే గొడవలు సృష్టించి పాదయాత్ర చేయకుండా చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే మాట్లాడే బాష ఇదేనా అంటూ ప్రశ్నించారు. గతంలో నర్సంపేట..ఇప్పుడు మహబూబాబాద్ లో జరిగిన ఘటనలకే ఇందుకు నిదర్శనమన్నారు. తమ బస్సులను కాల్చటం..శాంతి భద్రతల సమస్య సృష్టించి వారే అడ్డుకోవడం ఏంటని నిలదీసారు. కుళ్ళు, కుట్రలతో మా పాదయాత్ర అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు అందరూ నిలబడి ఖండిచాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లుగా ఒక్క విచారణ కూడా జరగలేదని చెప్పుకొచ్చారు. విచారణ చేయించుకోవాలని ప్రభుత్వానికి షర్మిల సవాల్ చేసారు. మహిళలు అంతా ప్రభుత్వం పైన తిరగ బడే రోజు ఉందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications