వారెవ్వా.. ఏం యాక్టింగ్.. కిడ్నాప్ అయినట్లు నటించి.. పెళ్లి చేసుకుని వీడియో విడుదల చేసిన యువతి..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గోలి శాలిని కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. శాలిని ప్రియుడితో కావాలనే వెళ్లిపోయినట్టు తెలిసింది. కిడ్నాప్ ఘటన తర్వాత ఆమె వీడియో కూడా విడుదల చేసింది. ప్రేమ పెళ్లికి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతోనే ప్రియుడి తో వెళ్ళిపోయినట్టు వీడియో విడుదల చేసింది.

సీసీటీవీ ఫుటేజీ
అంతకు ముందు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తండ్రితో కలిసి వేకువ ఝామున గుడికి వెళ్లిన యువతిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వైరల్ అయింది. అయితే సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఈ విషయంపై స్పందించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న ఆయన.. కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.

పోలీసులకు ఫిర్యాదు
యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున కారులో వచ్చిన వ్యక్తులు, తండ్రిని తోసేసి అమ్మాయిని తీసుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
వీడియో విడుదల
కానీ అమ్మాయే తను ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను అని వీడియో విడుదల చేయడంతో కథ సుఖాంతం అయింది. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications