వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Zika virus: తెలంగాణాలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న జికావైరస్; ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఐసిఎంఆర్ మరియు ఎన్ఐవి, పూణే నిర్వహించిన అధ్యయనం ప్రకారం, జికా వైరస్ తెలంగాణతో సహా చాలా భారతీయ రాష్ట్రాలకు వ్యాపించిందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటు జికా వైరస్ టెర్రర్ సృష్టిస్తుంది.

తెలంగాణాలోనూ జికా వైరస్ వ్యాప్తి

తెలంగాణాలోనూ జికా వైరస్ వ్యాప్తి

ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన జికా వైరస్ పై చేసిన ఈ అధ్యయనం భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని మరియు దాని నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. జికా వైరస్ పై చేసిన అధ్యయనంలో భాగంగా 1,475 రోగులకు సంబంధించిన, మొత్తం 188 నమూనాలలో జికా వైరస్ కనుగొనబడింది అని పేర్కొంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి 64 నమూనాలను పరీక్షించగా, జికా వైరస్ పాజిటివ్ అని తేలిందని అధ్యయనం వెల్లడించింది.

దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్.. లక్షణాలు ఇవే

దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్.. లక్షణాలు ఇవే

జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, దద్దుర్లు మరియు కీళ్ల మరియు కండరాల నొప్పి. జికా వైరస్ కు సంబంధించి గతేడాది కేరళలో 66 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణాలోనూ జికా వైరస్ వ్యాప్తి కనిపిస్తుంది. తాము చేపట్టిన ZIKV (జికా వైరస్) కోసం రెట్రోస్పెక్టివ్ నిఘా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ యొక్క నిశ్శబ్ద వ్యాప్తిని ప్రదర్శిస్తుంది అని అధ్యయనం పేర్కొంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచించింది.

తెలంగాణా లో సైలెంట్ గా జికా వ్యాప్తి.. లోకల్ ట్రాన్స్మిషన్ ఉందన్న అధ్యయనం

తెలంగాణా లో సైలెంట్ గా జికా వ్యాప్తి.. లోకల్ ట్రాన్స్మిషన్ ఉందన్న అధ్యయనం


ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్‌లలో వైరస్ ఉనికిని అధ్యయనం కనుగొంది. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో మే నుండి అక్టోబర్ 2021 వరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం నుండి నమూనాలను సేకరించి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, మరియు పంజాబ్ లో జికా వైరస్ నిశ్శబ్ద వ్యాప్తి కొనసాగుతుందని, ఈ రాష్ట్రాలలో లోకల్ ట్రాన్స్మిషన్ సూచించబడుతుంది అని అధ్యయనం పేర్కొంది.

 జికాపై అలెర్ట్ గా ఉండాలన్న శాస్త్రవేత్తలు

జికాపై అలెర్ట్ గా ఉండాలన్న శాస్త్రవేత్తలు

ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు జికా వైరస్‌ను గుర్తించడం ప్రారంభించినట్లు హైదరాబాద్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎపిడెమియాలజిస్ట్ మరియు ప్రొఫెసర్ షామన్న అన్నారు. ఇంతకుముందు, జికా అంటే ఏమిటో తమకు తెలియదని, కానీ ఇటీవల వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

English summary
Zika virus is spreading silently in Telangana state. According to a study conducted by ICMR and NIV, Pune, the Zika virus has spread to many Indian states, including Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X