పవన్ కల్యాణ్ టార్గెట్‌లో ఆ వైసీపీ ఎమ్మెల్యే: అక్కడ జనవాణితో జనంలోకి

తిరుపతి: ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని సిద్ధవటంలో కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు తాజాగా తిరుపతలో అడుగు పెట్టారు. నాలుగో విడత జనసేన-జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి జీఆర్ఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన అవసరాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది నాలుగో విడత జనసేన-జనవాణి కార్యక్రమం. రాయలసీమ జిల్లాల్లో తొలిసారిగా దీన్ని ఏర్పాటు చేసింది జనసేన పార్టీ అగ్రనాయకత్వం. 2024 నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్..తాను పోటీ చేయడానికి తిరుపతిని ఒక నియోజకవర్గంగా ఎంచుకోవడానికి అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

4th phase of Jana Sena-Janawani program launched by Pawan Kalyan at Tirupati.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి సహా తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని పవన్ కల్యాణ్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు సంధించారు. మైనారిటీలు, వికలాంగులు, వయోధిక వృద్ధులు జనసేన-జనవాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కనిపించారు. వారందరూ స్వయంగా పవన్ కల్యాణ్‌ను కలుసుకుని తమ వినతిపత్రాలను అందజేశారు. తమ ఆవేదనను ఆయనతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు తమ చుట్టాలుగా మార్చుకునే ప్రయత్నాలు సాగిస్తోన్నారని ధ్వజమెత్తారు. అలాంటి చర్యలను అడ్డుకోవడానికి జనసేనకు చెందిన ప్రతి సైనికుడు ముందుకు రావాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా వియోగించకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తే- ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

4th phase of Jana Sena-Janawani program launched by Pawan Kalyan at Tirupati.

తమ జిల్లాలో ఏకంగా 92 ఎకరాల చెరువును వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేశారంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందినవారు పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులో పిటీషన్ సైతం వేశామని చెప్పారు. ఈ కబ్జాల వెనుక మంత్రి ఉషా శ్రీచరణ్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశారు. మంత్రి అనుచరులు చెరువును కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చే ప్రయత్నం చేస్తోన్నారని అన్నారు. కబ్జా కోరల నుంచి చెరువును విడిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+