AP News: నాన్నను చూడాలని ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నోడి కోరిక..
మనిషి తాగితే ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. కొందరు తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తారు. అందుకే మద్యం శరీరానికే కాదు.. సమాజానికే చేటు. ఓ వ్యక్తి తాగి భార్యతో గొడవ పెట్టుకుని తన కొడుకునే చంపేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో జరిగింది. నిందితుడి పరారీలో ఉన్నట్లు తెలిసింది

కొంతకాలంగా గొడవలు..
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. అయితే రమేష్ భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు కాస్త పోలీసుస్టేషన్‌కు వెళ్లాయి. తర్వాత మళ్లీ కలిసున్నారు.

కొడుకుపై పెట్రోల్ పోసి..
ఈ క్రమంలో గత సోమవారం భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్‌పై చూపాడు. కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. గమనించిన చుట్టు పక్కల వారు బాలుడిని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

తీరని చివరి కోరిక..
రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే నాన్నే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని మహష్ కోరడం అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. బాలుడు తండ్రిని చూడకుండానే కన్ను మూశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమైంది. తాగుడుకు బానిసను చేసింది.












Click it and Unblock the Notifications