కలియుగ వైకుంఠంలా తిరుమల: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ: విశేషాలివే..
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. శనివారం 66,590 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,052 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

సోమవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతోన్నాయి. కన్నులపండువగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా జరిపారు.
శ్రీవారి తరపున సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగమైన యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం- విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణగా భావిస్తారు. తలపెట్టిన ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పిస్తూ విత్తనాలను నాటడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యాస్తమయం తరువాతే అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం, ఆగమ సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారకుడిగా పిలుస్తారు. పగటివేళ అంకురాలను నాటడాన్ని శాస్త్రం అంగీకరించదు. సూర్యాస్తమయం తరువాత శుభ ముహూర్తంలో దీన్ని చేపడతారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు. విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే ఆ ఉత్సవాలు కూడా అంత గొప్పగా జరిగినట్లు భావిస్తారు.
విత్తనాలు నాటడానికి పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు టీటీడీ అధికారులు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ అందులో నాటే విత్తనాలను కొత్త పాత్రలో పోసిన నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆ తరువాత అగ్నిహోత్రాన్ని వెలిగించడం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు.

ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications