తిరుమలలో ధ్వజ అవరోహణం- బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు టీటీడీ అర్చకులు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

Annual salakatla brahmotsavams in Tirumala came to the end

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.

Annual salakatla brahmotsavams in Tirumala came to the end

అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల పెద జీయ‌ర్‌ స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామివారి శిష్య‌ులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు అర్చ‌కం రామ‌కృష్ణ దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అనంతరం లోక కల్యాణాన్ని కోరుతూ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాల వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోవాలని, సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం దీక్షాంత స్నానం ఓ ఆచారంగా వస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.

Annual salakatla brahmotsavams in Tirumala came to the end

తిరుపతి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, టీటీడీ జేఈవోలు స‌దాభార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ న‌ర‌సింహ కిషోర్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు ఇందులో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+