టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి స్థానంలో సింఘాల్ - భక్తుల రద్దీ వేళ కీలక నిర్ణయాలు..!!

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనిల్ కుమార్ సింఘాల్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఈఓ ధర్మారెడ్డి కుమారుడి మరణంతో ఆయన కొద్ది రోజుల పాటు విధులకు దూరంగా ఉండనున్నారు. దీంతో, గతంలో ఈవోగా పని చేసిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ కు తాత్కాలికంగా బాధ్యతలు కేటాయించారు. జనవరి 2వ తేదీ వరకు ధర్మారెడ్డికి ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో ధనుర్మాసం సందర్బంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ధనుర్మాసం మొత్తం శ్రీవారికి సుప్రభాత సేవ రద్దు చేసారు. జవనరి 2వ తేదీ నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పెద్ద సంఖ్యలో తిరుమలకు వీఐపీల తాకిడి ఉంటుంది. ఈ సారి వీఐపీల సిఫార్సు లేఖలను అనుమతించకూడదని బోర్డు నిర్ణయించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత దక్కేలా ప్రోటోకాల్ జాబితాలో ఉన్న ప్రముఖులు నేరుగా వస్తే వారికి బ్రేక్ దర్శనం కల్పించాలని డిసైడ్ అయింది.

వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది.

AP Government appointed IAS Anil Kumar Singhal As TTD EO during the leave period of Dharma Reddy

దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసారు. జనవరి 1న సర్వదర్శనం టికెట్లు ప్రారంభమవుతాయి. టికెట్లు పూర్తయ్యే దాకా తిరుపతిలో కౌంటర్లు తెరచి ఉంచనున్నారు. వైకుంఠద్వారా దర్శనానికి సంభందించి రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ.300 దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్ లో కేటాయిస్తామని టీటీడీ ప్రకటించింది.

ఇప్పటికే బ్రేక్ దర్శనాల్లో చేసిన మార్పు లతో కొంత మేర సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం అవుతోంది. ఈ విధానం మరి కొన్ని రోజులు పరిశీలించిన తరువాత కొనసాగింపు అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు. ముక్కోటి ఉత్సవాలు పూర్తయిన తరువాత సంక్రాంతి పర్వదినాల్లోనూ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు వీఐపీ సిఫార్సు లేఖలను పక్కన పెట్టాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+