డీకే అరుణ కూడా: తెలంగాణలో తమదే అధికారం.. తట్ట బుట్ట సర్దుకో..
4 రాష్ట్రాల్లో బీజేపీ జయభేరీ మోగించింది. దీంతో ఆ పార్టీ నేతలు యమ జోష్‌లో ఉన్నారు. తెలగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని మరీ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీదే విజయమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఆమె దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే సమాధానం అన్నారు. తెలంగాణలో కేసీఆర్ తన ప్రాభవాన్ని కొల్పోతున్న క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లి వివిధ రకాల వేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల కోసమే అనేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోతుందని మీడియా, పలు సర్వేలు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని అందించారన్నారు.

కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని భావించిన ప్రజలు డబుల్ ఇంజిన్ కోసం బీజేపీని గెలిపించారన్నారు. నరేంద్రమోడీ మరోసారి ప్రధాని కావాలని, శత్రుదేశాలను ఎదుర్కొంటూ దేశాన్ని అభివృద్ధివైపు నడిపించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు. బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొక్కులు చెల్లించానని వివరించారు. శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చానని అరుణ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతామని బీజేపీ ధీమాతో ఉంది. కానీ బీజేపీకి ఇక్కడి ప్రజల విశ్వాసం దక్కనుందనే అంశంపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలు ప్లస్ తమిళనాడులో సిచుయేషన్ వేరుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications