తిరుమల నడక దారి భక్తులకు దర్శనం టికెట్స్ - ఈవో ధర్మారెడ్డి ప్రకటన..!!
తిరుమల కు నడకదారి భక్తులకు దర్శన టోకెన్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు.
Tirumala: తిరుమల కు నడకదారి భక్తులకు దర్శన టోకెన్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా నడకదారి భక్తులకు దర్శన టోకెన్ల పైన పెద్ద ఎత్తులన అభ్యర్ధనలు వస్తున్నాయి. దీని పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఈవో ధర్మారెడ్డి ఈ మేరకు నిర్ణయం వెల్లడించారు. ఇదే సమయంలో మరో కీలక అంశాన్ని చెప్పుకొచ్చారు. టీటీడీ కళ్యాణ్ మండపాల నిర్వహణ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ కోరిక మేరకు రాజాం బాలాజీ ఆలయం టీటీడీలో విలీనం చేసుకున్నారు.
కాలి నడకన వచ్చే భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు
ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో కొండ పైకి కాలి నడకన వచ్చే భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రాజాం వచ్చిన ధర్మారెడ్డి టీటీడీ కి సంబంధించి పలు నిర్ణయాలను చెప్పుకొచ్చారు. త్వరలోనే తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. నాలుగంచెల విధానంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని వివరించారు. టీటీడీలో ప్రవేశ పెట్టిన ముఖ గుర్తింపు విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని వివరించారు. వసతితో పాటుగా లడ్డూ ప్రసాదంలోనూ ఈ విధానం అమలు చేయటం ద్వారా ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. అదే విధంగా.. రాష్టంలో ఆదరణ తగ్గిన టిటిడి కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

రాజాం ఆలయం టీటీడీలో విలీనం
ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ కోరిక మేరకు టిటిడి పాలకమండలి ఆమోదం తో రాజాం బాలాజీ ఆలయం విలీనం చేసుకున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతి లడ్డును రాజాం ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయని చెప్పిన ధర్మారెడ్డి..తాజా నిర్ణయంతో వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు. తిరుమలలో 21వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వుంటుంది. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాత సేవ తరువాత ఆలయ శుద్ది తరువాత ఉదయం 7 నుండి 9 గంటల మధ్య సమయంలో విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని టీటీడీ అధికారులు వివరించారు.

రెండు రోజులు బ్రేక్ దర్మనాలు రద్దు
ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుతో పాటుగా ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 21,22 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ నెల 30న తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం జరగనుంది. 30వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications