చంద్రబాబుకు చెవిరెడ్డి సవాల్
Chevireddy Bhaskar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్‌పై ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
మోహిత్ రెడ్డిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత రోజు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో మోహిత్ రెడ్డిని నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఏ 37గా చేర్చారు.

దాడి జరిగిన సమయంలో మోహిత్ రెడ్డి యూనివర్శిటీలో ఉన్న స్ట్రాంగ్ రూంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి ఉన్నారని,. ఆ సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల సాక్షిగా ఇది నిర్ధారణ అయిందని చంద్రగిరి వైెఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. కేసు నమోదు సమయంలోనూ మోహిత్ రెడ్డి పేరు ఎక్కడా లేదని గుర్తు చేస్తోన్నారు.
పులివర్తి నానిపై దాడి జరిగిన 52 రోజుల తరువాత రాజకీయ కక్షతో మోహిత్‌రెడ్డి పేరును కేసులో చేర్చారని ఆరోపిస్తోన్నారు. కేసు నమోదైన తరువాత కూడా తుమ్మలగుంటలోని తన నివాసంలోనే ఉన్నారని, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారని వివరించారు. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు బెంగళూరులో మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమని విమర్శిస్తోన్నారు.
మోహిత్ అరెస్టుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విదేశాల్లో చదివిన తన కుమారుడిని వీధి పోరాటాలకు సిద్ధ పడేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. తన కొడుకు వయస్సు 25 సంవత్సరాలేనని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని గుర్తు చేశారు. అక్రమ కేసులో అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు.
విదేశాల్లో చదివిన తన కుమారుడికి వీధి పోరాటాలకు సిద్ధం చేస్తోన్నారని, అందుకు చంద్రబాబుకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని భాస్కర్ రెడ్డి అన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడినని, తన కంటే మించిన స్థాయిలో మోహిత్ రెడ్డిని ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని అన్నారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications