తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు శ్రీవారి ద‌ర్శ‌నానికి బ్రేక్: భ‌క్తుల‌తో తిరుమ‌ల కిట‌కిట : ద‌ర్శ‌నం మ‌రింత ఆల‌స్యం..!

|
Google Oneindia TeluguNews

సెల‌వులు..అందునా శ‌నివారం శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు తిరుమ‌ల కొండ మీద బారులు తీరారు. సిఫార్సు లేఖ ల‌ను ప‌క్క‌న పెట్టేసారు. ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్ల‌లో భ‌క్తులు నిరీక్షిస్తున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నానికి దాదాపు నాలుగు గంట‌ల పాటు బ్రేక్ ఏర్ప‌డుతోంది. సంప్రోక్ష‌ణ కోసం ద‌ర్శ‌నం నిలిపివేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

నేడు మ‌హా సంప్రోక్ష‌ణ‌..
తిరుమల తిరుపతి దేవస్థానంలో నేడు మహాసంప్రోక్షణ జరగనుంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుమ‌ల‌లోని వరాహస్వామివారి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు ఉన్న కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ క్రతువును జరపనుంది. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో సైతం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు జరగనున్నాయి. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తారు.

Four hours break for Sri Vari Darshanam to day : Mahasamprokshanam effect..

కొన‌సాగుతున్న ర‌ద్దీ...
ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు పూర్త‌యి సెల‌వులు ఇవ్వ‌టంతో తిరుమ‌ల కొండ భ‌క్త జ‌నంతో ర‌ద్దీగా మారింది. సెల‌వులు అందునా శ‌నివారం కావ‌టంతో ర‌ద్దీ మ‌రింత‌గా పెరిగింది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా సిఫార్సు లేఖ‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారు. కోడ్ ముగిసే వ‌ర‌కూ లేఖ‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. ఇక, ఇప్పుడు మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం..ద‌ర్శ‌నం నిలిపివేత పైన ముందుగానే స‌మాచారం ఇవ్వాల్సి ఉంది. అయినా..టిడిపి అధికారులు కేవ‌లం ఒక్క రోజు ముందు మాత్ర‌మే స‌మాచారం విడుద‌ల చేసారు. దీంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
Sri Vari Darshanam stopped for four hours to day. Due to maha Samprokshanam morning 11 to after noon up to 3 pm Darshanam will be closed. Heavy crowd in Tiruamala..with this decision Darshanam may take some more time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X