తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 30 గంటల సమయం..!

|
Google Oneindia TeluguNews

కలియగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లు భారీగా పెరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే భక్తులు తాకిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది.

వైకుంఠం-2 , నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోగా శిలాతోరణం వద్దకు భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమలకు రావాలని , కంపార్టు మెంట్లు, క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం తాగునీరు, అల్పహారం,చిన్నపిల్లలకు పాలు అందజేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

Heavy Crowd of devotees in Tirumala

బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించిన వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది, వేద‌పారాయ‌ణ‌దారులు, జియ్యంగార్ల శిష్య బృందం, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 2500 మంది సిబ్బందికి టీటీడీ కానుకలను అందజేసింది. అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింద‌ని టీటీడీ అధికారులు తెలిపారు

Heavy Crowd of devotees in Tirumala
English summary
The crowd of devotees in Tirumala has increased enormously. It takes about 30 hours to Srivari Darshanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X