పవన్ కామెంట్స్ కలకలం: వినూత్నంగా భూమన నిరసన, తుడా వద్ద ఇలా
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అదే రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. పవన్ చేసిన కామెంట్లను నిరసిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు.తిరుపతి తుడా సర్కిల్ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్ద వైసీపీ నేతలతో కలిసి నిరసనకు దిగారు.
చెప్పులను గుట్టగా పోసి... దాని ముందు కూర్చొని నిరసన చేపట్టారు. తిరుపతి మేయర్‌తోపాటు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సహా సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. తన వ్యాఖ్యలతో మూడు నేరాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజా ప్రతినిధులను చెప్పుతో కొడతానని కామెంట్ చేయడం ద్వారా పవన్ హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.

ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇలా కామెంట్ చేస్తే.. ఆ పార్టీ శ్రేణులు ఇంకెంత రెచ్చిపోతాయోనని కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు భేటీ కావడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ భేటీ అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదని, జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు తన కార్యక్రమాలను చాలా ముందుగానే భద్రతా సిబ్బందికి చెప్పాల్సి ఉంటుందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications