Pick talk: మీతో మాకు గొడవలు వద్దు: మూడు రాజధానులే కావాలి: తిరుపతిలో ఫ్లెక్సీలు..చించివేత
తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రవేశించిందీ పాదయాత్ర. ఇంకో మూడు రోజుల్లో ఈ పాదయాత్ర ముగియబోతోంది. తిరుపతిలో ముగింపు సభను ఘనంగా నిర్వహించడానికి అమరావతి ప్రాంత రైతులు సమాయాత్తమౌతున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసుల నుంచి అనుమతి ఇంకా అందాల్సి ఉంది.

17న ముగింపు సభ..
ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తమ ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలనేది అమరావతి ప్రాంత రైతుల ఉద్దేశం. ఈ పాదయాత్ర ముగింపుసభ.. అటు రాజకీయంగానూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నెల 17వ తేదీన ముగింపు సభ జరుగనుంది. దీన్ని విజయవంతం చేయడానికి వైసీపీయేతర పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన, సీపీఐ, సీపీఎం ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి.

పాల్గొననున్న సీనియర్లు..
ఆయా పార్టీల నాయకులందరూ దశలవారీగా పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావాన్ని తెలిపారు. వారికి నైతిక మద్దతును ప్రకటించారు. ఆయా పార్టీల నేతలందరూ ముగింపు సభకూ హాజరు కానుండటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున పార్టీ సీనియర్ నాయకులు, బీజేపీ నుంచి సోము వీర్రాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం నేత నారాయణ పాల్గొనే అవకాశం ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పాల్గొంటారని చెబుతున్నారు.

మీతో గొడవలు వద్దంటూ..
ఈ పాదయాత్రకు తిరుపతి ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇందులో భాగంగా మీతో మాకు గొడవలు వద్దు అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. తిరుపతిలో పలుచోట్ల ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. మీతో మాకు గొడవలు వద్ద.. మీకు మా స్వాగతం..మాకు మూడు రాజధానులే కావాలి..అంటూ తిరుపతి ప్రజల పేరు మీద ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. అమరావతి రైతుల పాదయాత్ర తిరుపతిలో ప్రవేశించబోతోన్న సమయంలో ఈ టెంపుల్ సిటీలో పలుచోట్ల కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
కొన్ని చోట్ల ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేతకు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించివేశారు. ఈ పని ఎవరు చేశారనేది తెలియరావట్లేదు. మూడు రాజధానులను వైసీపీయేతర పార్టీలన్నీ గట్టిగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో- ఈ బ్యానర్లు ధ్వంసం కావడం చర్చనీయాంశమౌతోంది. రాయలసీమలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటోన్నారు. దీన్ని ప్రతిబింబించేలా తిరుపతి ప్రజల పేరుతో ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

తిరుపతివాసుల్లో అసహనం..
అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను స్వాగతించడంతో పాటు మూడు రాజధానుల ఏర్పాటు పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను చించివేయడం కొంత ఉద్రిక్తతకు దారి తీసేలా కనిపిస్తోంది. తిరుపతి ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం సరికాదని చెబుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications