తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు.

మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్

వందల రోజులు జైల్లో ఉండి వచ్చిన జగనే..

వందల రోజులు జైల్లో ఉండి వచ్చిన జగనే..

వందల రోజులు జైల్లో ఉండి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మొండిగా వెళ్లి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.. పుట్టబోయే తరాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాకెంత మొండితనం ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం తాను మొండిగా వెళ్లలేనా? అని ప్రశ్నించారు. జగన్ తోపాటు 151 మంది ఎమ్మెల్యేలకు ప్రాణం మీద తీపి, ఆస్తుల మీద మమకారం ఉందని.. తనకేం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. సత్యం మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆ పరిస్థితిలో పార్టీ పెట్టా..

ఆ పరిస్థితిలో పార్టీ పెట్టా..

తాను ఎవరికీ భయపడనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను తన మనస్సాక్షి చెప్పినట్లు చేస్తానని అన్నారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టానని, అప్పటికీ రాష్ట్రం విడిపోలేదని చెప్పారు. అప్పుడు మాట మాట్లాడితే ముక్కలు ముక్కలుగా చీల్చిచెండాడే పరిస్తితి ఉందని.. అప్పుడే తాను పార్టీ పెట్టానని చెప్పారు. సుఖమైన పరిస్థితిలో పార్టీని పెట్టలేదన్నారు.

మనల్ని మర్యాదించే కాలం వస్తుంది..

మనల్ని మర్యాదించే కాలం వస్తుంది..

తాను రాజకీయాల్లోకి అన్నింటికీ తెగించే వచ్చానని పునరుద్ఘాటించారు. రెండున్నర దశబ్దాల తర్వాత మనల్ని మర్యాదగానే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.
కోర్టులలో న్యాయవాదులకు సరైన సౌకర్యాలు, వసతులు కూడా ఉండటం లేదని అన్నారు. తనను కోర్టుకు వచ్చి పరిశీలించాలని కొందరు న్యాయవాదులు కోరారని.. అయితే అక్కడ కోర్టు కార్యకలాపాలకు ఇబ్బందిలేదనుకుంటేనే వస్తానని చెప్పారు.

తోటి మనషుల కోసం మధ్యతరగతి వ్యక్తి పెట్టిన పార్టీ..

తోటి మనషుల కోసం మధ్యతరగతి వ్యక్తి పెట్టిన పార్టీ..

రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన లీగల్ వింగ్ ఎలా ఉండాలనేదానిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చర్చించాలని అన్నారు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. విధి విధానాలు తయారుచేయరే అన్న ఆవేదన కొందరిలో ఉందని తెలుసుకున్నానని చెప్పారు. తమది దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కాదని.. వేల కోట్లున్న పార్టీ కూడా కాదని అన్నారు. ఒక దిగువ మధ్యతరగతి నుంచి తోటి మనుషుల బాగు కోసం పెట్టిన పార్టీ అని పవన్ చెప్పారు.

అద్భుతాలు ఆశించకండి..

అద్భుతాలు ఆశించకండి..

తన నుంచి అద్భుతాలు ఆశించకండి.. కష్టమైపోద్దని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు చెప్పారు. కింద పడ్డ మీద పడ్డ తనపై కనికరం చూపండని అన్నారు. కనికరం చూపకున్నా తాను ప్రజల కోసం ముందుకే వెళతానని అన్నారు. తాను అమెరికాకు వెళ్ళినా.. ఎక్కడికెళ్లినా తనకు పోలీసులు సెక్యూరిటీ ఇస్తారని చెప్పారు. ప్రజల సమస్యలు వద్దనుకుని కళ్లు మూసుకునివుంటే సుఖమైన జీవితం ఉంటుందని.. కానీ తాను అది కోరుకోవడం లేదని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

English summary
Janasena president Pawan Kalyan shocking comments on AP CM YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X