తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి ముర్ము శ్రీవారి దర్శనం - క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ..!!

|
Google Oneindia TeluguNews

Tirumala: రాష్ట్రపతి ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి విజయవాడ - విశాఖలో పర్యటించారు. తిరుమల చేరుకున్న రాష్ట్రపతి పద్మవతి అతిధి గృహంలో బస చేసారు. ఈ ఉదయం తిరుమల సంప్రదాయాలను పాటిస్తూ ముందుగా రాష్ట్రపతి శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి టిటిడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ముర్ముకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

రాష్ట్రపతి హోదాలో తొలి సారి తిరుమలకు వచ్చిన ముర్ముకు శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి రాష్ట్రపతికి వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ముకు రంగనాయకుల మండపంలో అర్చకుల బృందం వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటాన్ని అధికారులు అందజేశారు. ఛైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ద్రౌపతి ముర్ముకు అందజేశారు. రాష్ట్రపతితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణ స్వామి, సత్యనారాయణ, రోజా, దేవాదాయ అధికారులు రాష్ట్రపతి తో పాటుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

President Droupadi Murmu offered prayers to lord Venkateswara at the Tirumala temple today.

స్వామి వారి దర్శనం చేసుకున్న తరువాత రాష్ట్రపతి తిరుపతికి బయల్దేరారు. పద్మావతి అతిథి గృహం వద్ద రాష్ట్రపతికి టీటీడీ అధికారుల సాదర వీడ్కోలు పలికారు. అలిపిరి వద్ద టీటీడీ గో మందిరం సందర్శించనున్న రాష్ట్రపతి అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ కానున్నారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి మధ్యాహ్నం నేరుగా డిల్లీకి పయనం అవుతారు. రాష్ట్రపతి హోదాలో తొలి సారి ఏపీకి వచ్చిన ముర్ముకు ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. గవర్నర్ రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్ధం విందు ఇచ్చారు. ఆ తరువాత విశాఖ వెళ్లిన రాష్ట్రపతి నేవీ డే వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఏపీ ప్రభుత్వం..ఏపీ ప్రజలు తనకు ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
President Droupadi Murmu offered prayers to lord Venkateswara at the Tirumala temple today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X