బ్లాక్‌లో స్పెషల్ దర్శన టికెట్లు ..టీటీడీ జూనియర్ అసిస్టెంట్ సహా దళారుల అరెస్ట్
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా తర్వాత మెల్లగా తిరుమల కొండమీదకి చేరుకుంటున్నారు. అయితే భక్తుల అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. దర్శన టికెట్లను విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అలా విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిలో టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కూడా ఉండటం గమనార్హం. దళారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమలలో రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. వీరికి టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ సహకారం అందిస్తున్నారు. ఐదుగురు దళారులతో దందా కొనసాగుతోంది. వీరి గురించి పోలీసులుకు తెలిసింది. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు రూ.5 వేల చొప్పున ఏడుగురికి టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించారని పోలీసులు తెలిపారు. రూ.300 టికెట్.. రూ.5 వేలకు విక్రయించి అడ్డంగా దోచుకుంటున్నారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని వారు ఆసరాగా చేసుకున్నారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కానీ అప్పటికే అయిపోవడంతో.. భక్తులు నిరీక్షిస్తున్నారు. అలా తమ ఏజెంట్ల ద్వారా టికెట్లను పొందారు. మరోవైపు రేపటినుంచి రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టొకెన్లను టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది.
Recommended Video
సెప్టెంబర్ 26 నుంచి 31 వరకు రోజుకు 8 వేల చొప్పును సర్వదర్శనం టొకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దానిని కొందరు దళారులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది కూడా సహకరించడంతో.. దోపిడీ ఈజీ అవుతోంది.












Click it and Unblock the Notifications