తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో బీజేపీ , వైసీపీల మధ్య పాట వివాదం ... తమ పాట కాపీ అంటూ వైసీపీ ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మాటల తూటాలను సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసిపి, బీజేపీల మధ్య ఒక పాట వివాదం రేపింది. తమ పాటను కాపీ కొట్టారంటూ వైసిపి, అది ఎప్పటి నుంచో ప్రచారానికి బిజెపి వినియోగిస్తున్న పాట అంటూ బి జె పి ఎవరి వాదన వారు వినిపిస్తూ తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను హీటెక్కిస్తున్నారు .

 తిరుపతిలో నిమ్మగడ్డ సమావేశం .. మున్సిపోల్స్ కు స్పీడ్ పెంచిన ఎస్ఈసి తిరుపతిలో నిమ్మగడ్డ సమావేశం .. మున్సిపోల్స్ కు స్పీడ్ పెంచిన ఎస్ఈసి

 వైసీపీ కోసం ప్రచారంలో ఉన్న ప్రజాదరణ పొందిన పాట రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న

వైసీపీ కోసం ప్రచారంలో ఉన్న ప్రజాదరణ పొందిన పాట రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న

అసలు ఇంతకీ ఆ పాట కథాకమామిషు ఏమిటంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం మంగ్లీ పాడిన రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాట చాలా ప్రజాదరణ పొందిన పాట. ఈ పాట గత ఎన్నికల సమయంలో కూడా జోరుగా సాగించిన ప్రచారంలో మోత మోగించింది. ఎవరి నోట విన్నా ఈ పాట వినిపించేది. ఇక ఏపి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సైతం ఈ పాటకు టిక్ టాక్ వీడియో ని చేశారంటే ఆ పాటకు ఉన్న ప్రజాదరణ ఏపాటిదో చెప్పొచ్చు.

 బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఇదే ట్యూన్ లో పాట.. భారతమాత ముద్దుబిడ్డ నరేంద్రమోడీ అంటూ

బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఇదే ట్యూన్ లో పాట.. భారతమాత ముద్దుబిడ్డ నరేంద్రమోడీ అంటూ

అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి ప్రచారం కోసం ఇదే తరహా పాటను ఉపయోగిస్తోంది. ఇదే వివాదానికి కారణం గా మారింది.

భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోడీ, ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా, ఎదురులేక ఎగిరెను ప్రజల గుండెల నిండా అంటూ సేమ్ రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న ట్యూన్ లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పాట బిజెపి, వైసిపి ల మధ్య వివాదానికి కారణం గా మారింది.

నామినేషన్ దాఖలు సమయంలో ఒకే ట్యూన్ లో రెండు పాటలు .. మా పాట కాపీ కొట్టారని వైసీపీ ఆరోపణ

నామినేషన్ దాఖలు సమయంలో ఒకే ట్యూన్ లో రెండు పాటలు .. మా పాట కాపీ కొట్టారని వైసీపీ ఆరోపణ


రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాటను కాపీ కొట్టి భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ అని బిజెపి మార్చిందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి . నిన్న నెల్లూరులో అటు వైసీపీ ఇటు బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఒకే ట్యూన్ లో ఉన్న ఈ రెండు పాటలు మారుమోగాయి. అయితే ఇది తమ పాట అని వైసీపీ శ్రేణులు వాదిస్తుంటే, ఎంతో కాలంగా ఇది బీజేపీ కోసం ప్రచారానికి వినియోగిస్తున్న పాట అంటూ బిజెపి నాయకులు కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు వాడుతున్న ఒకే బాణీలో ఉన్న పాటలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దుమ్మురేపుతున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదానికి కారణంగా మారాయి.

English summary
The political heat in the Tirupati Parliament by-election is continuing . YCP alleges that Rayalaseema Muddubidda Mana Jagananna song was copied by bjp , and they make a song as Bharatmata Muddubidda Narendra Modi. The BJP argues that it is a song that the BJP has been using for campaigning since last elections. Two songs in the same tune are heating up by-election for the Tirupati parliamentary seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X