తిరుపతికి నారా భువనేశ్వరి: అమరావతి రైతుల సభ ముగిసిన తరువాతే ఎందుకు

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బరిలో దిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారనున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఇదివరకు అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనలకు ప్రత్యక్ష మద్దతు పలికిన ఆమె- మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అప్పట్లో అమరావతి ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రైతులకు ఆర్థిక సహాయాన్ని చేయడానికి తాను ధరించిన ప్లాటినం గాజులను విరాళంగా ఇచ్చారు. దాని తరువాతే చంద్రబాబు జోలె పట్టారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించి విరాళాలను సేకరించారు.

అత్తింటివారి జిల్లాకు

అత్తింటివారి జిల్లాకు

ఇప్పుడు మరోసారి నారా భువనేశ్వరి క్షేత్రస్థాయి పర్యటనకుల పూనుకున్నారు. ఈ దఫా ఆమె తన అత్తింటివారి జిల్లా చిత్తూరు గడప తొక్కనున్నారు. తిరుపతిలో పర్యటించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావం వల్ల సంభవించిన భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించనున్నారు. వరద ముంపు గ్రామాల బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సహాయం చేయనున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున..

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున..

తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు మీద నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని ముంపు గ్రామాల బాధితులకు అందించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నారా, నందమూరి కుటుంబం ఉమ్మడిగా నిర్వహిస్తోంది. వరదల వల్ల మొత్తంగా 48 మంది మరణించినట్లు తెలుగుదేశం పార్టీ ఇదివరకే గుర్తించింది. ఆయా కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు భువనేశ్వరి.

చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనా?

చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనా?

ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఇదివరకే కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. బాధితులను ఉద్దేశించి అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం అయ్యాయి. అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు చెప్పుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తానూ మనిషినేనని, తనకు భావోద్వేగాలు ఉంటాయని, అందుకే మీడియా ముందు తాను ఆవేదన వ్యక్తం చేశానని చంద్రబాబు అప్పట్లో చెప్పారు.

తిరుపతి సభ తరువాతే..

తిరుపతి సభ తరువాతే..

ఈ నెల 17వ తేదీన అదే తిరుపతిలో అమరావతి ప్రాంత రైతులు బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు సహా అన్ని పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సైతం ఈ సభకు హాజరయ్యారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినదించారు. మూడు రాజధానుల కోసం తిరుపతిలో ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సైతం ఉమ్మడిగా ప్రదర్శనలను చేపట్టాయి.

అమరావతి రైతుల సభ ముగిసిన తరువాతే ఎందుకు?

అమరావతి రైతుల సభ ముగిసిన తరువాతే ఎందుకు?

ఈ పరిణామాలు చోటు చేసుకున్న అనంతరం నారా భువనేశ్వరి తిరుపతికి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి- వరదముంపు సంభవించి చాలారోజులే అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరమార్శించారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతోన్న ఆర్థిక సహాయం గురించి ఆరా తీశారు. అంతా మరిచిపోయారనుకుంటున్న దశలో భువనేశ్వరి మళ్లీ అదే ముంపు ప్రాంతాలకు వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతి ప్రాంత రైతుల బహరింగ సభ తరువాత ఆమె పర్యటించడం సైతం ఆకట్టుకుంటోంది.

రాజకీయ ప్రసంగాలు ఉంటాయా?

రాజకీయ ప్రసంగాలు ఉంటాయా?

చంద్రబాబు ప్రస్తావించిన అంశాన్ని భువనేశ్వరి కూడా లేవదీస్తారా?.. రాజకీయ ప్రసంగాలు చేస్తారా?.. అసెంబ్లీలో తనను అవమానించారనే విషయాన్ని ఆమె ఈ పర్యటన సందర్భంగా తిరుపతివాసులకు వివరించే ప్రయత్నం చేస్తారా?.. అనేది ఆసక్తిగా మారింది. ఆమె పర్యటనను విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ- కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉంటూ వస్తోన్న భువనేశ్వరి.. క్షేత్రస్థాయి పర్యటనకు దిగడం చర్చనీయాంశమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+