Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వారికి నీరు, పాలు, ఆహారం అందిస్తున్నారు. బుధవారం శ్రీవారిని 74 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. 32,688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీనివాసుడి హుండీ ఆదాయం 3.96 కోట్లు వచ్చిన టీటీడీ అధికారులు తెలిపారు. గత నెలలో శ్రీవారిని 23 లక్షల మంది దర్శించుకున్నట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. జూన్ లో స్వామి హుండీ ఆదాయం 116.14 కోట్లు వచ్చినట్లు చెప్పింది. గత నెలలో 1.06 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 10 లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు అధికారుల వెల్లడించారు.

ttd8

భక్తుల కోరిక మేరకు మూడు నెలల ముందుగా రూ.300/- దర్శన టికెట్లు విడుదల చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి 4 వేల రూ.300/- దర్శన టికెట్లు టికెట్లు అదనంగా విడుదల చేస్తామని చెప్పారు. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం ఉంది.

శ్రీవారికి అనేక మంది భక్తులు కానుకలు ఇస్తుంటారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి టీటీడీకి రూ. 4.5 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆలయం ముందు వాహనానికి పూజలు చేసి తిరుమల డీఐ జానకిరామిరెడ్డికి వాహనం అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+