Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 17 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వాహనం తోటి భక్తులు బయటకు తీశారు. ఆ వెంటనే అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చే వరకు గాయపడిన వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వారని తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Infosys founder Narayana Murthy garu & his wife Sudha Murthy garu (former TTD Board Member) donate Golden Abhishekha Shankam to Sri Varu Temple at Tirumala. They handed over to TTD EO Dharma Reddy garu. @TTDevasthanams @yvsubbareddymp @Infosys @Infosys_nmurthy @AndhraPradeshCM… pic.twitter.com/xM5lfm7f77
— S. Rajiv Krishna (@RajivKrishnaS) July 17, 2023
ఈ మధ్య తిరుపతి ఘాట్ రోడ్డు లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత 60 రోజుల్లో ఘాట్ రోడ్ లో నాలుగుకు పైగా ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాలకు కారణమేంటో గుర్తించాలని భక్తులు టీటీడీ అధికారులను కోరుతున్నారు. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం పాతిక వేల మంది భక్తులు తలనీలాలు, 71 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సోమవారం కూడా తిరుమలలో ఆలయం పై నుంచి విమానం వెళ్లింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తి శ్రీవారికి బంగారు శంఖం, బంగారు తాబేలును బహుకరించారు. ఆ కానుకలను ఆదివారం సమర్పించారు. టీటీడీకి గత అయిదేళ్లలో సుమారు 880 కోట్లు కానుకల రూపంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications