తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ కాటేజీలా..ప్రైవేటు హోటళ్లా: తిరుపతి ఉప ఎన్నిక వేళ..బీజేపీకి సవాల్: రూ.120 కోట్లు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వేళ.. భారతీయ జనతా పార్టీ సరికొత్త సవాల్‌ను ఎదుర్కొంటోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదికి తీసుకొచ్చింది. హిందువులు, హిందూయిజానికి తాము మాత్రమే ప్రతినిధులమని చెప్పుకొంటోన్న బీజేపీ నాయకులు.. అదే హిందువుల మనోభావాలతోనే ముడిపడి ఉన్న శ్రీవారి సేవలపై జీఎస్టీని వడ్డించడం సరికాదని, దీన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ను వినిపిస్తోంది. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోన్న బీజేపీ నాయకులకు దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది.

 తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండా తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండా

ఏటా రూ.120 కోట్ల భారం..

ఏటా రూ.120 కోట్ల భారం..

తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా 120 కోట్ల రూపాయలను జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. కాటేజీల అద్దె మొదలుకుని భక్తులకు కల్పించే సౌకర్యాలను జీఎస్టీ కిందికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. లడ్డూను జీఎస్టీ నుంచి మినహాయించినప్పటికీ.. ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి అవసరమైన అన్ని రకాల వస్తువులపైనా టీటీడీ జీఎస్టీని చెల్లిస్తోంది. టీటీడీ బోర్డు పరిధిలోకి వచ్చే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు, క్రయ విక్రయాలపై జీఎస్టీని వర్తిస్తుంది. వాటిని మినహాయించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా తొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇన్‌పుట్ సబ్సిడీ కింద టీటీడీకి చెల్లిస్తోందని గుర్తు చేశారు.

ప్రైవేటు హోటళ్ల తరహాలో..

ప్రైవేటు హోటళ్ల తరహాలో..


తిరుమల శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల నివాస వసతిని కల్పించడానికి ఉద్దేశించిన కాటేజీలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం సరికాదంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రైవేటు హోటళ్ల తరహాలో టీటీడీ కాటేజీలపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వసూలు చేస్తోందని, భక్తుల సౌకర్యం కోసం కల్పించినందున మినహాయింపు ఇవ్వాలనేది వారి డిమాండ్. టీటీడీ అనేది లాభార్జన కోసం ఏర్పాటైన పాలక మండలి కాదని, దాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థగా గుర్తించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే విషయాన్ని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో వినియోగించుకోనున్నారు.

తిప్పి కొట్టే పనిలో బీజేపీ..

తిప్పి కొట్టే పనిలో బీజేపీ..

వైఎస్సార్సీపీ నాయకులు తాజాగా లేవెనెత్తిన ఈ అంశాన్ని తిప్పి కొట్టే పనిలో పడ్డారు బీజేపీ నాయకులు. దీనిపై ఎదురుదాడికి సిద్ధమౌతున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇది కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తడానికి కారణమేంటనీ ప్రశ్నిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ది కోసమే దీన్ని తెరమీదికి తీసుకొచ్చారని చెబుతున్నారు. వైసీపీ నాయకులకు నిజంగా టీటీడీ, శ్రీవారి భక్తుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడే ఎందుకు అడ్డు చెప్పలేదని విమర్శిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ దొందుదొందేనని కౌంటర్ అటాక్ ఇస్తున్నారు.

Recommended Video

#Telangana : Etela Rajender Meets CM KCR ఈటెలను క్యాంఫ్ ఆఫీస్ కు తీసుకెళ్లిన కేటీఆర్.. మర్మమేమిటి?
 నేడో, రేపో అభ్యర్థి ప్రకటన..

నేడో, రేపో అభ్యర్థి ప్రకటన..

వైసీపీ లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన తిరుపతి స్థానానికి వచ్చేనెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ తరఫున తిరుపతికి చెందిన ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. మాజీ ఐఎఎస్ దాసరి శ్రీనివాసులు పేరును ఖరారు చేస్తారనే ప్రచారం ఉంది. కర్ణాటకకు చెందిన మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
YSRCP MP V Vijayasai Reddy here on Tuesday asked the Centre to stop discriminating against the TTD and withdrawal of the GST on the trust board. He wondered how could the BJP, a representative of the Hindus, impose GST on the Devasthanam Board that was rendering only seva (service) to the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X