Tirupati: తిరుమలలో పారిశుద్ద్య నిర్వహణ, ఐఐటీ నిపుణుల సలహాలు, వేలాది మంది ఆరోగ్యం, టీటీడీ ఈవో !
తిరుమల/ తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో పారిశుద్ద నిర్వహణపై మరింత శ్రద్ద తీసుకోవడానికి రంగం సిద్ం అయ్యింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకూడదని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి టీటీడీ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చడానికి ఐఐటి నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నిలయం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో పారిశుద్ద నిర్వహణపై మరింత శ్రద్ద తీసుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకూడదని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి టీటీడీ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు.... గుర్తు పెట్టుకోండి
ఈ సందర్భంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ వేలాదిగా విచ్చేసే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుతం వేకువ జామున ఐదు గంటలనుండి తిరుమలలో రోడ్లను శుభ్రం చేస్తున్నారని, దానిని తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రారంభించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఇలా వేకువ జామున నుంచి పని చేస్తే ఉదయానికల్లా రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు వీలవుతుందని జవహర్ రెడ్డి అన్నారు.

ఉదయానికి రోడ్ల మీద చెత్త ఏమాత్రం ఉండకూడదు
తిరుమలలోని ఆరోగ్య విభాగానికి చెందిన ఏడు వార్డుల్లో తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది, వర్కర్లు ఉన్నారని, వారిపై మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పక్కా ప్రణాళికతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పరిశుభ్రత విషయంలో చిన్న ఫిర్యాదులు కూడా రాకుండా జాగ్రత వహించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్లపై కుప్పలుగా ఉండే చెత్తను డస్టు బిన్లు, గన్ని బ్యాగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి తరలించాలని అధికారులకు ఆదేశించారు.

రెండు ఘాట్ రోడ్లల్లో జాగ్రత్త
ముఖ్యంగా తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్ రోడ్లలో వచ్చే చెత్తను రెండురోజులకోసారి యంత్రాల సహాయంతో శుభ్రం చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య విభాగం ఉపయోగిస్తున్న యంత్రాలు వాడుకుంటూ, ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉన్న శానిటరి సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు కలుగకుండా వారికి రేడియం జాకెట్లు అందివ్వాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఐఐటీ నిపుణులకు ఆహ్వానం
తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చడానికి ఐఐటి నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా ఐఐటి వారి సహకారంతో టీటీడీ ఆరోగ్య విభాగంకు ఎంత మంది సిబ్బంది అవసరం, ప్రమాణాలు, యంత్ర పరికరాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు.

అధికారులు చూసుకోవాలి
ఆరోగ్య విభాగంకు సంబంధించి వివిద ప్రాంతాల్లో పరిశుభ్రత ఏవిధంగా ఉన్నది, సిబ్బంది అటెండెన్స్ తదితర అంశాలను పరిశీలించడానికి టీటీడీ సీనియర్ అధికారులకు భాధ్యతలు అప్పగించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందికి బయో మెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శ్రీవారి భక్తుల స్పందన తెలుసుకోండి
తిరుమలలో అధిక రద్ధీ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో రోజువారి శానిటేషన్ ఏవిధంగా జరుగుతున్నది, భక్తుల నుండి వస్తున్న స్పందన ఏమిటి, భవిష్యత్తులో ఆరోగ్య విభాగంకు అవసరమైన యంత్ర పరికరాలపై ఈవో జవహర్ రెడ్డి సమీక్షించారు.
ఈ సమావేశంలో సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్ పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications