TTD: నూతన వధూవరులకు టీటీడీ ప్రత్యేక అవకాశం..!!
Tirumala: నూతన వధూవరులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పెళ్లైన జంటకు కళ్యాణోత్సవంతో పాటుగా శ్రీవారి దర్శనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా విధివిధానాలను ప్రకటించింది. వారం రోజుల వ్యవధిలో పెళ్లయిన నవ దంపతులకు వేంకటేశ్వరుని ఆశీస్సులు లభించేలా టీటీడీ ఈ ఆలోచన చేసింది. దీంతో కొత్తగా పెళ్లైన వారికి శ్రీవారి దర్శనం కలగనుంది.
పెళ్ళైన వెంటనే తిరుమలకు వచ్చి నూతన వధూవరులు శ్రీవారి కళ్యాణంలో పాల్గొని మొక్కలు తీర్చుకుంటామని మొక్కుకుంటారు. అలాంటి నూతన వధూవరులకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. నూతన వధూవరులు తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణంలో పాల్గొంటే సకల సౌఖ్యాలు, దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల విశ్వాసం.

కళ్యాణ సేవలో పాల్గొనాలని తిరుమలకు వస్తారు. అయితే ఎలా టికెట్ పొందాలో ..ఎక్కడికి వెళ్లాలో తెలియదు. నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్ రూ.1000. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి.పెళ్లైన కొత్త జంట ముందుగా సీఆర్‌వో కార్యాలయంలో ఆర్జిత సేవా లక్కీ దిప్ కౌంటర్‌కి వెళితే చాలు. ఫోటో ఫ్రూఫ్ కింద వధూవరుల పెళ్లి నాటి ఫోటో తప్పని సరి.

ఇక లిఖిత పూర్వక ఫ్రూఫ్ కింద వెడ్డింగ్‌కారుడ కూడా తప్పనిసరి. పళ్ళు వారం రోజుల లోపే ఉండాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డ్ సైతం తప్పనిసరిగా ఇవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా నూతన వధూవరులు నేరుగా కల్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద జారీ చేయబడిన 100 కల్యాణోత్సవం టిక్కెట్లలో 20 ఇక నుండి నూతన వధూవరులకు కేటాయించారు. ఏదైనా నిర్దిష్ట రోజున టిక్కెట్‌ను బుక్ చేసుకున్న జంటల సంఖ్య కోటాను మించకపోతే, మిగిలిన టిక్కెట్లు ఇతర యాత్రికులకు సాధారణ కోటా కింద జారీ చేస్తారు.












Click it and Unblock the Notifications