శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం -టికెట్లకు లాస్ట్ ఛాన్స్: ఇవి తప్పనిసరి- అవి రద్దు..!!

తిరుమలలో రద్దీ పెరుగుతోంది. కొత్త సంవత్సరం..ముక్కోటి ఏకాదశి వేళ శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. గతం కంటే ఈ సారి సాధారణ భక్తులకు ఎక్కువగా సంఖ్యలో దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు పలు సూచనలు చేసింది. రెండు దశాబ్దాలకు పైగా టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంబించింది. పది రోజుల పాటుగా వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచటం ద్వారా ఎక్కువ మందికి అవకాశం దక్కుతోంది. ఈ సారి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం

జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పూర్తయ్యాయి. జనవరి 1వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం తిరుపతిలో తొమ్మది కేంద్రాల ద్వారా టోకెన్లు ఇవ్వనున్నారు. జనవరి 1వ తేదీ ప్రారంభించి టోకెన్లు పూర్తయ్యే వరకూ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. ఎస్వీబీసీ ఛానల్ తో పాటుగా టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు టోకెన్ల లభ్యత ను తెలుసుకొనే అవకాశం ఉంటుంది. తిరుమల కొండ పైన రద్దీ.. దర్శనం ఖరారు చేసుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. దర్శనం టికెట్ పైన ఉన్న సమయానికి అనుగుణంగా తిరుమల రావాలని భక్తులను కోరుతోంది.

4.50 లక్షల టికెట్లు.. తిరుపతిలో కౌంటర్లు

4.50 లక్షల టికెట్లు.. తిరుపతిలో కౌంటర్లు

జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 1వ తేదీ మధ్నాహ్నం 2 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేయనున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 4.50 లక్షల టోకెన్లు పంపిణీ పంపిణీ చేయనున్నారు. క్యూ లైన్లలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. తిరుపతిలో అలిపిరి వద్ద ఉన్న భూదేవీ కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2,3 సత్రాలు, విష్ణు నివాసం, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణీ వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసారు. వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది. ఈ టైం స్లాట్ టోకెన్ల ద్వారా క్యై లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకోవచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

మాస్క్ తప్పనిసరి.. సిఫార్సు లేఖలు రద్దు

మాస్క్ తప్పనిసరి.. సిఫార్సు లేఖలు రద్దు

జనవరి 1వ తేదీ నుంచి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన పది రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు .అదే సమయంలో కోవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న వేళ..కేంద్రం నుంచి అందుతున్న మార్గదర్శకాల మేరకు మాస్కు తప్పని సరి చేసింది. ఈ పది రోజుల్లో దాదాపు 8 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనానికి రానున్నారు. దీంతో, కోవిడ్ మందస్తు చర్యల్లో భాగంగా మస్కు వినియోగం తప్పని సరి చేసారు. టోకెన్లు కలిగిన వ్యక్తులను మాత్రమే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. టోకెన్లు లేని వారిని తిరుమలకు అనుమతించినా..దర్శనానికి అవకాశం ఉండదని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+